Conch Shell: పూజ గదిలో శంఖం ఉంటే మంచిదా? లక్ష్మీదేవి కటాక్షం కోసం ఏది ఉంచాలి?
Conch Shell : శంఖం ఊదినప్పుడు వెలువడే ఓంకార నాదం.. మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది.
Conch Shell
మన హిందూ సంప్రదాయంలో పూజ గదిలో శంఖానికి ఎప్పుడూ కూడా ఒక విశిష్టమైన స్థానం ఉంది . శంఖాన్ని కేవలం అలంకారంగానో, ఒక వస్తువుగానో కాకుండా, సాక్షాత్తు లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తుంటాం. పురాణాలలో చెబుతున్నదాని ప్రకారం, దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మథించినప్పుడు, ఆ సమయంలో సముద్రం నుంచి లక్ష్మీదేవితో పాటు శంఖం(Conch Shell) కూడా ఉద్భవించింది.
అందుకే శంఖం ఉన్న ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కాగా శ్రీ మహావిష్ణువు ధరించే శంఖాన్ని మాత్రం పాంచజన్యం అని పిలుస్తారు. అయితే అసలు పూజ గదిలో పెట్టుకోవడానికి ఎలాంటి శంఖం(Conch Shell) ఉండాలి,దేని కోసం ఉండాలో చాలామందికి తెలియదు.
శంఖాలలో ముఖ్యంగా రెండు రకాలుంటాయి. ఒకటి దక్షిణావృత శంఖం రెండోది వామావృత శంఖం. దక్షిణావృత శంఖం అనేది కుడి వైపునకు తిరిగి ఉంటుంది. ఇది చాలా అరుదుగా దొరుకుతుంది. ఈ శంఖాన్ని పూజ గదిలో ఉంచి, దానిలో నీరు నింపి ఆరాధిస్తే సిరిసంపదలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.
ఈ శంఖంలోని నీళ్లను సూర్యుడికి అర్ఘ్యంగా ఇస్తే కంటి సమస్యలు తగ్గిపోతాయని కూడా అంటారు. ఇక రెండోది వామావృత శంఖం, ఇది ఎడమ వైపునకు తెరుచుకుంటుంది. సాధారణంగా మన పూజలలో ఊదే శంఖం ఇదే ఉంటుంది. దీని ధ్వని వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

పూజ గదిలో శంఖాన్ని ఉంచడం వల్ల ఆ ఇంట్లోవారికి మానసిక శాంతి లభిస్తుంది. శంఖం ఊదినప్పుడు వెలువడే ఓంకార నాదం.. మనస్సును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు.. శంఖం ఊదడాన్ని మనం గమనిస్తుంటాం. అది దైవిక శక్తిని ఆహ్వానించడానికి సూచన అని పెద్దలు చెబుతున్నారు.
అయితే ఇంట్లో శంఖాన్ని ఉంచేటప్పుడు మాత్రం దానిని ఒక పీఠంపై ఉంచి, రోజూ పూజ చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయట. శంఖం కేవలం భక్తికి గుర్తు మాత్రమే కాదు, అది మన సంస్కృతిలో ఒక విజయానికి, శుభారంభానికి చిహ్నంగా హిందువులు భావిస్తారు.
Coconut Water:కొబ్బరి నీళ్లు అమృతమా.. విషమా? నిపుణులు ఏమంటున్నారు?





