Just SpiritualLatest News

Karthika Masam : శివకేశవుల కటాక్షం కావాలా? కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాలేంటి?

Karthika Masam : కార్తీక మాసంలో సాయంత్రం సమయంలో ఇంట్లోని పూజ గదితో పాటు తులసి కోట వద్ద కూడా తప్పకుండా దీపం వెలిగించడం మంచిది.

Karthika Masam

కార్తీక మాసం వచ్చిందంటే అది కేవలం ఒక నెల రోజులు క్యాలెండర్ కాదు, అదొక ఆధ్యాత్మిక రీఛార్జ్ సమయం. మన శక్తికి, హెల్త్‌కు తగినట్లుగా చిన్న చిన్న నియమాలు పాటిస్తే చాలు.. లైఫ్‌లో పాజిటివ్ వైబ్స్ దానంతట అవే వచ్చేస్తాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ నెల(Karthika Masam) మొత్తం మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ, సాత్వికమైన జీవనశైలికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రశాంతమైన జీవితం కావాలనుకునేవారికి ఈ నెల ఒక మంచి అవకాశమని చెప్పొచ్చు.

రోజూ తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం పూర్తి చేసి, శివకేశవులను మనసారా తలచుకోవాలి. ఇక సాయంత్రం సమయంలో ఇంట్లోని పూజ గదితో పాటు తులసి కోట వద్ద కూడా తప్పకుండా దీపం వెలిగించడం మంచిది. ఈ నెలలో చాలామంది మాంసాహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, ప్యూర్ వెజిటేరియన్ ఆహారమే తింటారు. ఈ నెలరోజులూ హరిహరుల నామస్మరణ చేయడం వల్ల మనసులోని అనవసర ఆందోళనలు, నెగిటివ్ ఆలోచనలు పోయి కష్టాలు తొలగిపోయి ప్రశాంతత దక్కుతుంది.

కేవలం పూజలే కాకుండా సేవా గుణానికి కూడా నవంబర్ నెలలో చాలా ప్రాధాన్యం ఉంది. మన శక్తి కొద్దీ ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, బట్టలు, లేదా వారికి అవసరం అయిన దానిని దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కోపతాపాలు పక్కన పెట్టి ప్రేమగా, నిజాయితీగా వ్యవహరించడం, తోటివారికి సహాయపడటం వంటి మంచి అలవాట్లను ఈ నెలలో అలవాటు చేసుకోవాలి.

సమయం దొరికినప్పుడల్లా దగ్గరలోని శివాలయం, వెంకటేశ్వరస్వామి,శ్రీ కృష్ణుని ఆలయాలను దర్శించుకుంటే మనసు రీఫ్రెషింగ్‌గా, ఉత్సాహంగా ఉంటుంది. ఈ చిన్న అలవాట్లే ఏడాదంతా మన జీవితాన్ని సరైన దారిలో నడిపించడానికి ఉపయోగపడతాయని పెద్దల నమ్మకం.

Rumours : రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తారు? దీనిపై సైకాలజిస్టులు ఏం చెబుతున్నారు?

Related Articles

Back to top button