Just SpiritualLatest News

Karthika Pournami : కార్తీక పౌర్ణమి విశిష్టత.. 365 ఒత్తుల దీపారాధన ఎలా చేయాలి?

Karthika Pournami : మహాశివరాత్రితో సమానమైన కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి పూజా విధానాలు పాటించాలి. పుణ్యఫలాలు దక్కాలంటే పాటించాల్సిన నియమాలు, ఎలాంటి తప్పులు చేయకూడదో చేద్దాం.

Karthika Pournami

హిందూ సాంప్రదాయంలో కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉందన్న విషయం మన పెద్దలు చెబుతూనే ఉంటారు. అంతేకాదు కార్తీక పౌర్ణమి(Karthika Pournami)ని మరొక మహా శివరాత్రిగా భక్తులు భావిస్తుంటారు. ఈరోజు వేకువజామునే సముద్ర లేదా నదీ స్నానం ఆచరించడం అనంత పుణ్యఫలాన్ని ఇస్తుంది.

ఒకవేళ నదీ స్నానానికి వెళ్లడానికి వీలు కాకపోతే ఇంట్లో స్నానం చేసే నీటిలోనే గంగా జలాన్ని కలుపుకొని స్నానమాచరించినా సరిపోతుంది. తర్వాత ఉపవాస సంకల్పం ఒకసారి చెప్పుకుని శివుడికి రుద్రాభిషేకం, విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజలు చేయాలి. అలాగే ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో శుభాలు చేకూరుతాయి.

సాయంత్రం ప్రదోష కాలంలో ఆవు నెయ్యితో 365 ఒత్తుల దీపాన్ని వెలిగించడమనేది విశేష ఫలాన్నిస్తుంది. ఈ ఒత్తులను వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో, కొవ్వొత్తితో కాకుండా అగరబత్తిని మాత్రమే ఉపయోగించడం మంచిది. ఉసిరికాయలో కానీ బియ్యం పిండితో చేసిన ప్రమిదలో కానీ ఆవు నెయ్యి వేసి దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దారిద్ర్యం తొలగిపోతుందని పండితులు చెబుతారు.

ఈరోజు రావిచెట్టు, తులసికోట దగ్గర దీపాలను వెలిగించి, నదులు లేదా కోనేటిలో ప్రమిదలను వదలాలి. పెళ్లికాని వారు తులసి, ఉసిరి మొక్కల వద్ద రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి పూజిస్తే మంచి జీవిత భాగస్వామి లభిస్తారని విశ్వసిస్తారు.

ఈ రోజు అన్నదానం, వస్త్రదానం, ఉసిరికాయల దానం చేయడం వల్ల చేసిన పాపాలు తొలగిపోతాయి. రాత్రి సమయంలో మనఃకారకుడైన చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి, చలిమిడి, వడపప్పును నైవేద్యంగా పెట్టి దీక్షను విరమించాలి.

ఈ పవిత్రమైన రోజు ఆల్కహాల్, మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. అలాగే ఈరోజు ఎవరితోనూ పరుషంగా మాట్లాడకూడదు. ఈరోజు ఇంటికి వచ్చిన యాచకులను కసురుకోకుండా ఆహారాన్ని అందించాలి. అలాగే పౌర్ణమి(Karthika Pournami) రోజు పాలు, వెండి పాత్రలను ఎట్టి పరిస్తితులలోనూ ఇతరులకు దానంగా ఇవ్వకూడదని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Lava Smart 4 Pro : పవర్ ఫుల్ బ్యాటరీ, ఐఫోన్ లుక్..రూ.10,999 కే అదిరిపోయే ఫీచర్లు..

Related Articles

Back to top button