Lemon Garland : కాళికాదేవి, దుర్గాదేవికి నిమ్మకాయల దండలంటే ఇష్టమే..కానీ ఈ తప్పు అస్సలు చేయకండి..
Lemon Garland : రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయలతో దీపం వెలిగించినా లేదా ఈ నిమ్మకాయలతో దండ వేసినా పెళ్లి సంబంధాలు కుదరడం, ఉద్యోగాలు రావడం వంటి మంచి ఫలితాలుంటాయి.
Lemon Garland
దుర్గా దేవి, కాళికా దేవి అమ్మవారి గుడికి వెళ్లినపుడు, ఊళ్లలో జాతరలు జరిగినపుడు అమ్మవారి మెడలో ఉండే నిమ్మకాయల దండలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. ముఖ్యంగా దుర్గాదేవి, కాళీమాతతో పాటు గ్రామదేవతల ఆలయాల్లో నిమ్మకాయ దండలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే పూల దండలు ఉండగా భక్తులు అమ్మవారికి నిమ్మకాయల దండలనే ఎందుకు వేస్తారనే అనుమానం వస్తుంది.
నిజానికి ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం నిమ్మకాయ అంటే కేవలం సిట్రస్ జాతికి చెందిన పండో, కాయో కాదు, అదొక పవర్ ఫుల్ ఎనర్జీ అబ్సార్బర్ అని చెబుతారు. మనలో కానీ లేదంటే మన చుట్టూ కానీ ఉన్న నెగిటివ్ ఎనర్జీని పీల్చేసే పవర్ నిమ్మకాయకు ఉంది. అందుకే అమ్మవారికి నిమ్మకాయల దండను వేస్తే మన కష్టాలు, దోషాలను అమ్మవారు తొలగిస్తారని పండితులు చెబుతారు.
సాధారణంగా అమ్మవారికి 18, 54 లేదా 108 నిమ్మకాయలతో దండ తయారుచేసి మెడలో అలంకరించాలని పండితులు అంటారు. ఎందుకంటే ఈ సంఖ్యలు మన సంప్రదాయంలో ఎంతో పవిత్రమైనవిగా నమ్ముతారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే పచ్చిగా ఉన్న నిమ్మకాయల కంటే పండిన పసుపు రంగు నిమ్మకాయలతోనే దండను తయారు చేయాలి.
ఎందుకంటే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు దుష్టశిక్షణ చేసే సమయంలో ఉగ్ర రూపంలో ఉంటారు. నిమ్మకాయలో ఉండే పులుపు, చలువ చేసే గుణం వల్ల అమ్మవారి రౌద్రం తగ్గుతుందని..దీనివల్ల అమ్మవారు ప్రశాంతంగా మారతారని పురాణాలు చెప్తున్నాయి. అలాగే మనలో ఉండే ఈర్ష్య, ద్వేషం, దిష్టి వంటి ప్రతికూల ప్రభావాలను ఈ నిమ్మకాయలు గ్రహించడం మనకు మేలు జరుగుతుందట.
ఇక జ్యోతిష్యపరంగా చూస్తే, అమ్మవారికి నిమ్మకాయల దండను సమర్పించడం వల్ల రాహు, గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయలతో దీపం వెలిగించినా లేదా ఈ నిమ్మకాయలతో దండ వేసినా పెళ్లి సంబంధాలు కుదరడం, ఉద్యోగాలు రావడం వంటి మంచి ఫలితాలుంటాయి.
అయితే ఇక్కడే భక్తులంతా ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అమ్మవారికి నిమ్మకాయల దండ(Lemon Garland)లు ఇష్టమే కానీ..ఆ ఆచారాన్ని కేవలం ఆలయాల్లో ఉండే అమ్మవారికి మాత్రమే సమర్పించాలి. ఇంట్లో చేసే సాత్విక పూజల్లో ఈ నిమ్మకాయ దండలను వాడకూడదు.

ఎందుకంటే దీని వెనుక కొంత తాంత్రికపరమైన ప్రాముఖ్యత కూడా ఉంటుందట. అలాగే గుడిలో అమ్మవారికి దండను సమర్పించి, అక్కడ పూజారి ఇచ్చిన రెండు మూడు నిమ్మకాయలను తెచ్చుకుని ఇంటి గుమ్మానికి కట్టుకుంటే నరదిష్టి, నరఘోష, శత్రు పీడలు దరిచేరవని పెద్దలు చెబుతారు.
దీని వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అమ్మవారి జాతరలప్పుడు, అమ్మవారి తీర్థాలు వంటివి జరిగినపుడు జనాలు గుమిగూడినప్పుడు వ్యాధులు వ్యాపించకుండా ఉండటానికి నిమ్మకాయలను వాడేవారు. నిమ్మకాయ నుంచి వచ్చే నేచురల్ సువాసన గాలిలోని బ్యాక్టీరియాను చంపేస్తుంది.
Intuition : నోటి మాట ఫలించడం వెనుక పవర్స్ ఉంటాయా?సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ ఏం చెబుతున్నాయ్..





