Just SpiritualLatest News

Plants : ఇంట్లో అదృష్టాన్ని తెచ్చే మొక్కలు..వాస్తు చిట్కాలు

Plants : తులసి మొక్క ఎప్పుడూ ఇంటికి ఈశాన్య దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి.

Plants

మొక్కలు కేవలం అందానికి మాత్రమే పెంచుతున్నామని చాలామంది అనుకుంటారు. కానీ ఇంటి వాస్తును సరిదిద్దడానికి కూడా ఉపయోగపడతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అసలు ఏ మొక్కను పెంచితే మంచిది, ఏ మొక్కను పెంచితే కష్టాలు వస్తాయి. అయితే తప్పుడు దిశలో మొక్కలు పెడితే ఏమవుతుందన్న విషయాలను తెలుసుకోవాలని అంటున్నారు. ఏ మొక్కలు నెగటివ్ ఎనర్జీని పెంచుతాయి..ఏ మొక్కలు అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయనే విషయంపై అవగాహన పెంచుకోవాలి.

ఏ దిశలో ఏ మొక్క ఉండాలంటే ..తులసి (Tulsi)మొక్కను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా హిందువులు భావిస్తారు. తులసి మొక్క ఎప్పుడూ ఇంటికి ఈశాన్య (North-East)దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి. తులసి ఇంట్లోని గాలిని శుద్ధి చేయడమే కాకుండా శాంతిని కూడా ఇస్తుంది.

మనీ ప్లాంట్ (Money Plant)అయితే ఆగ్నేయ (South-East) దిశలోనే ఉంచాలి. అప్పుడే అది ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది.అలాగే అలోవెరా (Aloe Vera)మొక్కను ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంటే ఆరోగ్యంతో పాటు వాస్తుకు కూడా మంచిది.

Plants
Plants

దురదృష్టాన్ని తెచ్చే మొక్కలను అస్సలు ఇంట్లో పెంచుకోవద్దని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం ముళ్లున్న మొక్కలను అంటే కాక్టస్ జాతికి చెందిన వాటిని ఇంటి లోపల పెంచకూడదు. కాక్టస్ జాతికి చెందిన మొక్కలను ఇంట్లో పెంచితే కుటుంబ సభ్యుల మధ్య గొడవలకు కారణమవుతాయని వాస్తు నిపుణులు చెబుతారు.

అలాగే, పాలు కారే మొక్కలను పెరటిలో పెంచొచ్చు కానీ..ఇంటికి ఆనుకుని కానీ, ఇంట్లో కానీ పెంచకూడదు. అంతేకాదు ఏవైనా మొక్కలు ఎండిపోతే ఆ మొక్కలను వెంటనే తీసి పడేయాలి. ఎందుకంటే ఆ ఇంట్లో వారి పురోగతిని అడ్డుకుంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button