Just SpiritualLatest News

Taurus:వృషభ రాశి .. పరాభవ నామ సంవత్సర వార్షిక ఫలాలు 2026-27

Taurus: వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ ఏడాది మంచి లాభాలనే తెచ్చిపెడుతుంది. అయితే భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ల మధ్య విభేదాల వల్ల విడిపోయే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలి.

Taurus

ఆదాయం 5 – వ్యయం 14
రాజపూజ్యం 5 – అవమానం 4

పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి(Taurus) వారికి ఆదాయం 5 వంతులుగా ఉంటే వ్యయం 14 వంతులుగా ఉంది. రాజపూజ్యం 5 , అవమానం 4 వంతులుగా ఉంది. ఈ ఏడాది శని భగవానుడు శుభ స్థానంలో ఉండటంతో కొన్నికొన్ని ఇబ్బందులు ఎదురైనా, చివరికి శుభ ఫలితాలే దక్కుతాయి.

వృషభ రాశి(Taurus) వారికి గ్రహాల అనుకూలత వల్ల పర్సనల్ లైఫ్‌ సంతోషంతో నిండి ఉంటుంది. మనోధైర్యం పెరగడంతో పాటు స్థిరాస్తులు , విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం అపనిందలు భరించాల్సి రావచ్చు, అలాగే ఆకస్మిక నిర్ణయాల వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.

ఇతరుల చేతిలో మోసపోయే ప్రమాదం ఉండటంతో జాగ్రత్త వహించాలి. వాహన ప్రమాదాలు, సోదరులతో విరోధాలు మరియు పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. అయినా సరే మీ తెలివితేటలతో కుటుంబంలో వివాహాది శుభకార్యాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు.

ఉద్యోగస్తుల విషయానికి వస్తే విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి, అలాగే విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా ఈ ఏడాది అద్భుతమైన యోగం పడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఆకస్మిక బదిలీలు, అలాగే అధికారుల వల్ల చిన్నపాటి ఇబ్బందులు ఉండొచ్చు. ప్రైవేట్ రంగంలో ఉండేవాళ్లు.. మంచి అవకాశాల కోసం కంపెనీలు మారే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈ ఏడాది పర్మినెంట్ అయ్యే సూచనలున్నాయి.

రాజకీయ నాయకులకు ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రజల్లోనూ, పార్టీ అధిష్టానంలో కూడా మీ గౌరవం పెరుగుతుంది. భారీగా ఖర్చు పెట్టినా సరే ఎన్నికల్లో విజయం సాధించి ఉన్నత పదవులు పొందే అవకాశం కనిపిస్తోంది. కళారంగం వారికి కూడా ఈ ఏడాది అద్భుతంగా ఉంటుంది. సినిమా, టీవీ , నాటక రంగంలో ఉండేవారు నూతన అవకాశాలు అందుకుంటారు. వారి కృషికి తగిన గుర్తింపుతో పాటు ప్రభుత్వం నుంచి అవార్డులు పొందే అవకాశముంది.

కాగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ పరాభవ నామ సంవత్సరం మంచి లాభాలనే తెచ్చిపెడుతుంది. అయితే భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్ల మధ్య విభేదాల వల్ల విడిపోయే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మామూలు ఫలితాలు ఉంటాయి. స్టూడెంట్స్ శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు, ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు.

Taurus
Taurus

క్రీడాకారులకు మాత్రం పరాభవ నామ సంవత్సరంలో విశేషంగా కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది. జాతీయ జట్లకు ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వ్యవసాయదారులకు పంట దిగుబడి బాగున్నా ప్రకృతి వైపరీత్యాల వల్ల చేతికందిన పంట చేజారిపోయే ప్రమాదం ఉంది. అప్పులు తీరడం కష్టమవ్వొచ్చు.

ఇక స్త్రీలకు ఈ ఏడాది చాలా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినా స్త్రీలదే పైచేయి అవుతుంది. అంతేకాదు గతంలో విడిపోయిన జంటలు ఈ ఏడాది కలిసే అవకాశం కనిపిస్తోంది. అయితే గర్భ సంబంధిత ఆరోగ్య సమస్యల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. మొత్తం మీద వృషభ రాశి వారు ఈ ఏడాది ఇంటా, బయటా గౌరవం పెరిగి మిశ్రమ ఫలితాలు అందుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button