Just SpiritualLatest News

Ugadi:లక్ష్మీ కటాక్షం కోసం ఉగాది రోజు ఈ వస్తువులు కొనుక్కోండి..

Ugadi: ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న తులసి మొక్కను హిందూ సాంప్రదాయంలో సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.

Ugadi

కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేటప్పుడు తమ జీవితం సుఖసంతోషాలతో, విజయాలతో నిండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మన సంప్రదాయం ప్రకారం ఉగాది(Ugadi) పండుగ అనేది కొత్త ఏడాదికి ఆరంభంగా భావిస్తాము. అయితే ఆ శుభ ఘడియలు రాక ముందే.. ఇంటికి కొన్ని వస్తువులను తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభించడంతో పాటు ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయని పెద్దలు చెబుతుంటారు.

వీటిలో ముందుగా మామిడి ఆకుల గురించి చెప్పుకోవాలి. మామిడి ఆకులంటే కేవలం అలంకారానికే కాదు.. అవి ఇంటికి తోరణాలుగా కట్టడం వల్ల ఎన్నో శుభాలు చేకూరుతాయి. మామిడి ఆకులు ఇంట్లో దుష్టశక్తులు దరిచేరకుండా రక్షణ కవచంలా పని చేస్తాయని మన నమ్మకం. అలాగే ఉగాది పచ్చడిలో మనం వాడే వాటిలో కీలకమైన వేప పువ్వు, వేప ఆకులు పవిత్రతకు నిదర్శనంగా చెబుతారు. వీటిని ఇంట్లో ఉంచడం వల్ల ఆరోగ్యం చేకూరడమే కాకుండా చుట్టుపక్కల వాతావరణం కూడా స్వచ్ఛంగా, పవిత్రంగా మారుతుంది.

ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న తులసి మొక్కను హిందూ సాంప్రదాయంలో సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కొత్త ఏడాది రోజు ఇంటి ప్రాంగణంలో తులసి కోటను ఏర్పాటు చేసుకోవడం వల్ల సానుకూల శక్తి పెరిగి, మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుందట.

అలాగే ఆర్థికాభివృద్ధిని కోరుకునే వారు ఉగాది(Ugadi) రోజు బంగారం లేదా వెండి ఆభరణాలను కొంటూ ఉంటారు. ఇది రాబోయే కాలంలో ధన వృద్ధికి సంకేతంగా నిలుస్తుంది.

వీటితో పాటు శంఖం,ముఖ్యంగా దక్షిణావర్తి శంఖాన్ని పూజా గదిలో ఉంచుకోవడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని ప్రతీతి. ఇంట్లో ప్రశాంతతను పెంచడానికి లోహంతో చేసిన తాబేలు ప్రతిమను లేదా నెమలి ఈకలను కూడా తెచ్చుకోవచ్చు. ఇవి అదృష్టాన్ని మోసుకొస్తాయని చాలా మంది బలంగా నమ్ముతారు

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అడ్డంకులను తొలగించే వినాయకుడు, సంపదను ఇచ్చే లక్ష్మీదేవి విగ్రహాలను కొత్తగా కొని పూజించడం వల్ల ఏడాది పొడవునా పనులు సజావుగా సాగుతాయి.

Ugadi
Ugadi

ఇంటి ముఖద్వారం వద్ద కలశాన్ని ఏర్పాటు చేయడం, అంటే రాగి, ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి మామిడి ఆకులు, పువ్వులతో అలంకరించడం వల్ల దైవ శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ఆనందానికి ప్రతిరూపమైన లాఫింగ్ బుద్ధా ప్రతిమను కూడా వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంచితే సంతోషం వెల్లివిరుస్తుందట.

అరటి మొక్కలు , అరటి ఆకులతో ఇంటిని అలంకరించడం వల్ల అభివృద్ధి, ఆరోగ్యం లభిస్తాయి. వీటన్నింటితో పాటు కొత్త దుస్తులు ధరిస్తే అది ఒక కొత్త ఆశకు, సరికొత్త ప్రారంభానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇలా కొన్ని వస్తువులను సమకూర్చుకోవడం వల్ల కష్టాలు తొలగిపోయి, అందరికీ శుభప్రదంగా మారుతుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button