Salt:సాయంత్రం పూట ఉప్పు కొంటున్నారా? ఉప్పుతో వాస్తు చిట్కాలు
Salt: ఉప్పు దానం చేయడం మంచిదే అయినా సరే, దానికి కొన్ని సమయాలు ఉన్నాయి. శుక్రవారం రోజు ఉప్పు దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందట.
Salt
ఉప్పు కేవలం రుచి కోసం వాడే పదార్థం మాత్రమే కాదు. అది సానుకూల శక్తికి , లక్ష్మీదేవి కటాక్షానికి సంకేతంగా నిలుస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అంతెందుకు వాస్తు , జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం, ఉప్పును ఉపయోగించే విధానం.. మన ఇంట్లో ఆర్థిక స్థితిగతులపై, శాంతి సౌఖ్యాలపైన కూడా డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుందని అంటారు. అందుకే వంటగదిలో ఉండే ఉప్పు విషయంలో కొన్ని కఠినమైన నియమాలు పాటించాలని శాస్త్రాలు కూడా చెబుతాయి.
ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో ఉప్పును కొనడం అస్సలు మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం పూట ఉప్పు కొనడం వల్ల ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని అంటారు. ఇలా కొనడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమై అనవసరపు ఖర్చులను పెంచుతుందని చెబుతారు. అంతేకాకుండా ఈ అలవాటు వల్ల కుటుంబం అప్పుల పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఉప్పు దానం చేయడం మంచిదే అయినా సరే, దానికి కొన్ని సమయాలు ఉన్నాయి. శుక్రవారం రోజు ఉప్పు దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందట. అయితే అది సాయంత్రం పూట మాత్రం అస్సలు చేయకూడదు. రాత్రి వేళల్లో ఇతరులకు ఉప్పు ఇవ్వడం వల్ల ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోయి పేదరికం వచ్చే అవకాశం ఉంటుందట.
అలాగే ఉప్పును ఎప్పుడూ ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి డైరెక్టుగా ఇవ్వకూడదట. ఇలా చేయడం వల్ల ఇచ్చేవారి పుణ్యం తీసుకునేవారికి బదిలీ అవ్వడమే కాకుండా, వారిద్దరి మధ్య విరోధం ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సాల్ట్కు శుక్ర గ్రహంతో సంబంధం ఉంటుంది. సాయంత్రం వేళల్లో సాల్ట్ను ఇతరులకు ఇవ్వడం వల్ల శుక్ర గ్రహం బలహీనపడుతుంది. శుక్రుడు సంతోషం, విలాసాలకు, వైవాహిక సౌఖ్యానికి కారకుడు. కాబట్టి శుక్రుడు బలహీనపడితే దంపతుల మధ్య గొడవలు జరిగి ఇంటి ప్రశాంతత దెబ్బతింటుంది.
ఒకవేళ మీ ఇంట్లో కనుక నెగిటివిటీ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే, శుక్రవారం రోజు ఒక చిన్న పరిహారం పాటిస్తే సరిపోతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఒక ఎర్ర కలర్ క్లాత్లో కొద్దిగా ఉప్పును కట్టి, ఆ మూటను వంటగదిలో ఎవరికీ కనపడకుండా ఒక మూలన ఉంచితే సరిపోతుందట. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని ఆ ఉప్పు పీల్చుకుని, ఆర్థిక వృద్ధిని, లక్ష్మీదేవి ఆశీస్సులను కలిగిస్తుందని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.





