Just SpiritualLatest News

Negative Energy : నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి?.. దిష్టి తీయడం వెనుక ఉన్న రహస్యం తెలుసా?

Negative Energy : నరదృష్టి లేదా దిష్టి తగిలినప్పుడు ఇంట్లో అంతా బాగున్నా.. హఠాత్తుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావడం, మనశ్శాంతి కరవవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి.

Negative Energy

మనం డైలీ లైఫ్‌లో దిష్టి తగలడం లేదా నరదృష్టి అనే మాట చాలా రెగ్యులర్‌గా వింటూ ఉంటాము. అందుకే ఎవరైనా చాలా ఆనందంగా ఉన్నా బిజినెస్‌లో మంచి లాభాలు వస్తున్నా లేదా అందంగా ముస్తాబైనా.. వారికి దిష్టి తగులుతుందని పెద్దలు చెబుతుంటారు.

నరుడి కంటికి నల్లరాయి కూడా పగులుతుందనే సామెత మన సొసైటీలో బలంగా నాటుకుపోయింది. అసలు ఈ దిష్టి తగలడం వెనుక ఉన్న నిజానిజాలు ఏంటి, దీనిని సైన్స్, ఆధ్యాత్మికత ఏ కోణంలో చూస్తాయి, దీని లక్షణాలు ఎలా ఉంటాయో వాస్తు నిపుణులు వివరిస్తున్నారు.

దిష్టిని శాస్త్రీయంగా, ఆధునిక భాషలో నెగెటివ్ ఎనర్జీ(Negative Energy) (వ్యతిరేక శక్తి) అని పిలుస్తారు. ప్రతి మనిషి బాడీ చుట్టూ ఒక కాంతి వలయం (Aura) ఉంటుంది. మన ఆలోచనలు, చూపులు ఒక ఎనర్జీ రూపంలో బయటకు వస్తుంటాయి.

ఎవరైనా ఒక వ్యక్తి వేరే వ్యక్తిని చూసి అసూయపడినా, కుళ్లుకున్నా, లేదా నెగిటివ్ ఆలోచనలతో చూసినా.. వారి కళ్ల నుంచి, మనసు నుంచి వెలువడే ఆ బలమైన వ్యతిరేక తరంగాలు ఆ వ్యక్తి కాంతి వలయాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. దీనినే మన పెద్దలు దిష్టి లేదా కంటిదోషం అని చెబుతారు.

కేవలం మనుషులకే కాకుండా కొత్తగా కట్టుకున్న ఇళ్లకు, కంపెనీలకు, బిజినెస్‌లకు కూడా ఇలాంటి ఈర్ష్యా పూరిత చూపుల వల్ల నరఘోష తగులుతుందని పెద్దలు అంటారు.

నరదృష్టి లేదా దిష్టి తగిలినప్పుడు ఇంట్లో అంతా బాగున్నా.. హఠాత్తుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు రావడం, మనశ్శాంతి కరవవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా విపరీతమైన బద్ధకం, అలసట, కారణం లేకుండా తలనొప్పి రావడం, ముఖంలో కళ తప్పడం జరుగుతూ ఉన్నా అది దిష్టి కిందే లెక్క.

అలాగే వ్యాపారంలో ఉన్నట్టుండి నష్టాలు రావడం, చేతికి వచ్చిన పనులు ఆఖరి నిమిషంలో ఆగిపోవడం, ఇంట్లోని పెంపుడు జంతువులు అకస్మాత్తుగా చనిపోవడం, మొక్కలు వాడిపోవడం వంటివి కూడా నరదృష్టి ప్రభావంగానే జరుగుతాయని పెద్దలు భావిస్తారు. పిల్లలయితే ఏ కారణం లేకుండా పదే పదే ఏడవడం, పాలు తాగకపోవడం వంటివి చేస్తుంటారట.

ఈ నెగెటివ్ ఎనర్జీకి లేదా దిష్టి దోషానికి ఎలా చెక్ పెట్టాలి అనేదానికి కొన్ని మార్గాలున్నాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా కల్లుప్పు లేదా సముద్రపు ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ(Negative Energy) వెంటనే తొలగిపోతుందట.

ఇంటి ముఖద్వారం వద్ద బూడిద గుమ్మడికాయ కట్టడం, నిమ్మకాయలు, గుర్రపునాడాలను వేలాడదీయడం వల్ల ఇంటి లోపలికి వచ్చే వారిలోని అసూయ, నెగిటివ్ చూపులను అవి అక్కడే పీల్చుకుంటాయని అంటారు. దీనికోసమే నల్లటి త్రాడుతో చేసిన దిష్టిబొమ్మలను కూడా ఇంటికి తగిలిస్తుంటారు.

ఆదివారం రోజు అయినా, అమావాస్య వంటి స్పెషల్ రోజులలో అయినా ఎండుమిరపకాయలు, కల్లుప్పు, కొద్దిగా ఆవాలు కలిపి తల చుట్టూ మూడు సార్లు తిప్పి నిప్పులలో కానీ అవకాశం లేనివాళ్లు డస్ట్ బిన్‌లో కానీ వేయడం వల్ల దిష్టి దోషం పోతుందట.

వ్యాపారాలు చేసుకునే చోట కర్పూర హారతి ఇచ్చి దిష్టి తీయడం వల్ల లాభాలు బాగుంటాయని వాస్తు నిపుణులు సలహా ఇస్తుంటారు. ప్రతిరోజూ సాయంత్రం వేళ ఇంట్లో సాంబ్రాణి లేదా గుగ్గిలం ధూపం వేయడం వల్ల కూడా మూలమూలలా దాగి ఉన్న వ్యతిరేక శక్తులు నశించి, ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండుతుందని వాస్తు నిపుణులు అంటారు.

Negative Energy
Negative Energy

నిజానికి దిష్టి అనేది కేవలం ఒక మూఢనమ్మకం కాదని.. మనుషుల ఆలోచనలలో ఉండే మంచి, చెడుల ప్రభావమేనని వాస్తు పండితులు వివరిస్తున్నారు. అందుకే మన ఆలోచనలను ఎంత పాజిటివ్‌గా ఉంచుకుంటే, మనపై ఇలాంటి కంటిదోషాల ప్రభావం అంత తక్కువగా ఉంటుందట.

గమనిక: పైన పేర్కొన్న విషయాలు భారతీయ సాంప్రదాయ నమ్మకాలు, పురాతన గ్రంథాలు , ప్రజల నమ్మకాల ఆధారంగా రాయబడినవి. దీనిలోని విషయాలను జస్ట్ తెలుగు ధ్రువీకరించడం లేదు.

Numerology : మీ డేట్ ఆఫ్ బర్త్ 7, 16, 25 ?.. అయితే మీ మైండ్‌లో ఏముందో ఎవరూ ఊహించలేరు..

Related Articles

Back to top button