Just SpiritualLatest News

Anjaneyaswamy: ఆంజనేయస్వామికి చిరంజీవి అనే వరం ఇచ్చిందెవరు?

Anjaneyaswamy: ఆంజనేయస్వామికి అరుదైన 'చిరంజీవి' వరాన్ని ఎవరు, ఎందుకు ఇచ్చారనే కథ చాలా మందికి తెలీదు.

Anjaneyaswamy

ఆంజనేయస్వామి (Anjaneyaswamy)కేవలం బలం, భక్తికి మాత్రమే ప్రతీక కాదు, ఆయన ‘సప్త చిరంజీవులలో’ ఒకరు. అంటే, సృష్టి అంతమయ్యే వరకు జీవించే అదృశ్య శక్తి. ఆంజనేయస్వామికి ఈ అరుదైన ‘చిరంజీవి’ వరాన్ని ఎవరు, ఎందుకు ఇచ్చారనే కథ చాలా మందికి తెలీదు.

చిరంజీవి వరం వెనుక కథ..రామాయణం ముగిశాక, రావణుడిని సంహరించి, అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరాముడు, హనుమంతుడి సేవకు, నిస్వార్థ భక్తికి ముగ్ధుడయ్యారు.

రాముడు హనుమంతుడిని అక్కున చేర్చుకుని, “హనుమా! నీ సేవకు ఏ ప్రతిఫలం ఇవ్వగలను? నీ పరాక్రమం, నీ భక్తి మానవమాత్రులు కొలవలేనివి. అందువల్ల ఈ జగత్తులో రామకథ ఎంత కాలం ఉంటుందో, అంతకాలం నువ్వు నిత్యుడిగా ఈ భూమిపై ఉండుగాక!” అని ఆశీర్వదించారు.

ఆ వెంటనే, సీతాదేవి సైతం హనుమంతుడికి ఆనందంగా మరొక వరం ఇచ్చారు: “హనుమా! ఎప్పుడూ యవ్వనంతో, చిరంజీవిగా ఉండు. నీకు ఎప్పుడూ రోగాలు, బాధలు దరిచేరవు. నీ కీర్తి, శక్తి దిక్కులంతా వ్యాపించుగాక!”

ఈ విధంగా, శ్రీరాముడు , సీతాదేవిల ఆశీర్వాదంతో ఆంజనేయస్వామి చిరంజీవిగా, సకల శక్తులతో నిండిన వ్యక్తిగా కలియుగాంతం వరకు భక్తులను రక్షిస్తూ ఉంటారు.

Anjaneyaswamy
Anjaneyaswamy

కలియుగంలో (Anjaneyaswamy)స్వామివారి మహిమలు..
సాహిత్యంలో, రామాయణం జరుగుతున్న ప్రదేశంలో, రామకథ జరుగుతున్న చోట ఆంజనేయస్వామి సూక్ష్మ రూపంలో ఎప్పుడూ ఉంటారని చెప్పబడింది.

కలియుగంలో సమస్యలు, కష్టాలు చుట్టుముట్టినప్పుడు హనుమంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే, ఆయన అదృశ్య రూపంలో వచ్చి ఆపదలను తొలగిస్తారని భక్తులు బలంగా విశ్వసిస్తారు. అందుకే ఆయన్ని సంకటమోచనుడు అని కూడా పిలుస్తారు.

హనుమంతుడి(Anjaneyaswamy) యొక్క అత్యంత శక్తివంతమైన రూపాలలో పంచముఖి ఆంజనేయస్వామి ఒకటి. ఈ ఐదు ముఖాలు – హనుమ, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవ – ఐదు దిక్కుల నుండి భక్తులను రక్షించి, భయాన్ని, దుష్ట శక్తులను పారదోలుతాయని నమ్మకం.

ఆంజనేయస్వామి చిరంజీవత్వం కేవలం ఒక కథ కాదు, అది మన ధైర్యానికి , భక్తికి ఆధారం. కలియుగంలో ఏ ఆపద వచ్చినా, ‘జై శ్రీరామ్’ అంటూ ఆయన్ని స్మరించుకుంటే, ఆ శక్తి మనకు అండగా నిలుస్తుందని నమ్మేవారు కోట్లాది మంది ఉన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button