Punjab Kings : పంజాబ్ కింగ్స్ ను ఆపతరమా ?..రాజస్థాన్ కు అసలైన సవాల్
Punjab Kings : ఐపీఎల్ 19వ సీజన్ లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ మరో విజయంపై కన్నేసింది.
Punjab Kings
ఐపీఎల్ 19వ సీజన్ లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్(Punjab Kings) మరో విజయంపై కన్నేసింది. ముల్లాన్ పూర్ వేదికగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్ తలపడబోతోంది. అసలు పంజాబ్ కింగ్స్(Punjab Kings) జోరు మామూలుగా లేదు. మొదట బ్యాటింగ్ అయినా, ఛేజింగ్ అయినా ఆ జట్టు జోరుకు అడ్డే లేకుండా పోయింది.
గత మ్యాచ్ లో 265 పరుగుల రికార్డు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి చరిత్ర సృష్టించింది. పంజాబ్ బ్యాటర్లు అద్భుతమైన ఫామ్ తో చెలరేగిపోతున్నారు. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ , అందరి కంటే ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ లతో రెచ్చిపోతున్నాడు. అటు కెప్టెన్ గానూ అదరగొడుతూ, ఇటు బ్యాటర్ గానూ చెలరేగిపోతూ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు.
ఈ టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేని జట్టు పంజాబ్ కింగ్స్ మాత్రమే. ఆడిన 7 మ్యాచ్ లలో 6 విజయాలు, ఒకటి వర్షంతో రద్దయిన కారణంగా మొత్తం 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ మెరుగుపడాల్సి ఉంది. విజయ్ కుమార్ వైశాఖ్ , చాహల్ నిలకడగా రాణిస్తుండగా.. మిగిలిన బౌలర్లు బార్ట్ లెట్, అర్షదీప్ సింగ్, మార్కో జెన్సన్ వికెట్లు తీస్తున్నా పరుగులు కట్టడి చేయలేకపోతున్నారు. వీరు కూడా గాడిన పడితే ఇక పంజాబ్ జైత్రయాత్రను అడ్డుకోవడం కష్టమే.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కు గత మ్యాచ్ లో షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 225 పరుగుల భారీస్కోరు చేసినా కాపాడుకోలేకపోయింది. బ్యాటింగ్ పరంగా అదరగొడుతున్నా బౌలింగ్ మాత్రం ఆ జట్టుకు సమస్యగా మారింది. నిలకడలేమితో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు సతమతమవుతున్నారు.

బ్యాటింగ్ లో మాత్రం రాయల్స్ కు తిరుగులేదు. వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫామ్ లో ఉండగా.. జైస్వాల్ కూడా రాణిస్తున్నాడు. జురెల్, ఫెరీరా, హెట్ మెయిర్ , జడేజా వంటి వారితో బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం ఇప్పటి వరకూ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. అటు బౌలింగ్ లో ఆర్చర్ , బర్గర్ తో పాటు తుషార్ దేశ్ పాండే పేస్ విభాగంలో కీలకంగా ఉన్నారు.
స్పిన్నర్లుగా జడేజా, రవి బిష్ణోయ్ పర్వాలేదనిపిస్తున్నా పరుగులు కట్టడి చేయడంలో ఇబ్బందిపడుతున్నారు. దీంతో బౌలింగ్ బలహీనతలను అధిగమిస్తే తప్ప బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న పంజాబ్ ను ఓడించడం కష్టమే.
Gas Prices : గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. మే 1 నుంచి గ్యాస్ ధరలు పెరుగుతాయా?





