Just SportsLatest News

CSK : వాంఖడేలో ముంబైకి షాక్..చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ

CSK : ఐపీఎల్ 19వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు విజయాల తర్వాత సన్ రైజర్స్ చేతిలో ఓడిన ఆ జట్టు ఇప్పుడు ముంబై ఇండియవ్స్ పై అదిరిపోయే విజయాన్ని అందుకుంది

CSK

ఐపీఎల్ 19వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్(CSK) మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు విజయాల తర్వాత సన్ రైజర్స్ చేతిలో ఓడిన ఆ జట్టు ఇప్పుడు ముంబై ఇండియవ్స్ పై అదిరిపోయే విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ లో సంజూ విధ్వంసకర శతకం, బౌలింగ్ లో అకిల్ హొస్సేన్ స్పిన్ మ్యాజిక్ తో ముంబై చిత్తుగా ఓడిపోయింది.

ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ముంబై ఫీల్జింగ్ ఎంచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్(CSK) కు ఓపెనర్లు సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ మెరుపు ఆరంభాన్నిచ్చే క్రమంలో దూకుడుగానే ఆడారు. తొలి వికెట్ కు 32 పరుగులు జోడించారు. రుతురాజ్ ఔటైన తర్వాత సంజూ ఒకవైపు జోరు కొనసాగిస్తున్నా మిగిలిన బ్యాటర్లు మాత్రం భారీస్కోర్లు చేయలేకపోయారు.

కానీ సంజూ మాత్రం సర్ఫరాజ్ ఖాన్ తో 40, బ్రెవిస్ తో 31 కార్తీక్ శర్మతో కలిసి 43 పరుగులు జోడించాడు. ఈక్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో వరుసగా సిక్సర్లు, బౌండరీలు కొట్టి శతకాన్ని అందుకున్నాడు. ఈ సీజన్ లో అతనికి రెండో సెంచరీ. ఓవరాల్ గా సంజూ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ముంబై బౌలర్లలో ఘజన్ ఫర్ 2, అశ్వని కుమార్ 2 వికెట్లు పడగొట్టారు.

CSK
CSK

తర్వాత ఛేజింగ్ లో ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే చేతులెత్తేసింది. కేవలం 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన డానిశ్ మలేవర్ (0), నమన్ ధీర్ (0) డకౌటయ్యారు. డికాక్ (7) పరుగులకే వెనుదిరిగాడు. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ ఆదుకునే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్ కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అయితే వీరిద్దరినీ అఖిల్ హొస్సేన్ పెవిలియన్ కు పంపాడు. తిలక్ వర్మ 37 , సూర్యకుమార్ యాదవ్ 36 పరుగులకు ఔటయ్యారు. ఇక్కడ నుంచి ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. టెయిలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్ళారు.

దీంతో ముంబై 104 పరుగులకు ఆలౌటైంది. ముంబై ఇన్నింగ్స్ లో 8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే ఔటయ్యారు. అకిల్ హొస్సేన్ 4 వికెట్లు తీయగా…నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో ఐదో ప్లేస్ కు చేరుకుంది.

Voters : తమిళనాడులో 85… బెంగాల్ లో 90 శాతం..రికార్డు స్థాయిలో పోటెత్తిన ఓటర్లు

Related Articles

Back to top button