Just SportsLatest News

DC vs KKR : విజయంతో ముగించిన ఢిల్లీ..కోల్ కతాకు మరో ఓటమి

DC vs KKR : కోల్‌కతా నైట్ రైడర్స్‌ను వారి సొంతగడ్డపైనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 40 పరుగుల తేడాతో ఓడించింది

DC vs KKR

ఐపీఎల్ 19వ సీజన్ ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ముగించింది. కోల్ కతా నైట్ రైడర్స్ ను వారి సొంతగడ్డపైనే 40 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ ఆరోస్థానంలో నిలిస్తే.. గెలిచే మ్యాచ్ లో చేజేతులా ఓడిన కోల్ కతా ఏడో ఓటమిని ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్ విజయంతోనే కోల్ కతాకు ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది.

టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెవర్లు పోరెల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 40 పరుగులు జోడించారు. పోరెల్ (22) పరుగులకు ఔటైనా కెఎల్ రాహుల్, సాహిల్ పరాక్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 47 రన్స్ జోడించారు. సాహిల్ 17 బంతుల్లో 24 (3 ఫోర్లు, 1 సిక్సర్) ఔటైన తర్వాత అక్షర్ పటేల్, రాహుల్ కు జత కలిసాడు.

ధాటిగా ఆడుతూ స్కోర్ పెంచారు. వీరిద్దరూ 38 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. ఈ క్రమంలో రాహుల్ 30 బంతుల్లో 60 (5 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులకు వెనుదిరిగాడు. అనంతరం అక్షర్ పటేల్ (39), డేవిడ్ మిల్లర్ (28) పరుగులు చేయగా.. చివర్లో అశుతోశ్ శర్మ మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది.

ఛేజింగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కూడా ధాటిగానే ఆడింది. ఓపెనర్లు ఫిన్ అలెన్, రహానే తొలి వికెట్ కు 4.2 ఓవర్లలోనే 43 పరుగులు జోడించారు. అలెన్ (20) ఔటైన తర్వాత రహానే, మనీశ్ పాండే ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

DC vs KKR
DC vs KKR

మనీశ్ పాండే (25) పరుగులకు ఔటవడంతో ఇక్కడ నుంచి కోల్ కతా బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. ఒకవైపు రహానే క్రీజులో ఉన్నా మరోవైపు మిగిలిన బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. గ్రీన్ (2) , రింకూ సింగ్ (0) డకౌట్ కొంపముంచాయి. అదే సమయంలో రహానే 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులకు ఔటవగా… తేజస్వి దహియా కూడా ఫెయిలయ్యాడు.

దీంతో పావెల్ ధాటిగా ఆడినా చివర్లో చేతులెత్తేశాడు. ఫలితంగా కోల్ కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 , ఎంగిడి 3 వికెట్లు పడగొట్టారు.

Ebola Virus : మరోసారి లాక్ డౌన్ తప్పదా ?..ఆఫ్రికాలో ఎబోలా మరణ మృదంగ

Related Articles

Back to top button