Hardik Pandya : ఇంత బరితెగింపా ?..హార్థిక్ ను ఏకిపారేస్తున్న ఫ్యాన్స్
Hardik Pandya : ఆటలో అద్భుతమైన ఆల్ రౌండర్ గా గుర్తింపు ఉన్న పాండ్యా తన ప్రవర్తనతో మాత్రం వివాదాల్లో నిలుస్తుంటాడు
Hardik Pandya
మనం ఏ స్థాయిలో ఉన్నా మన ప్రవర్తనే చాలా ముఖ్యం.. నేను సెలబ్రిటీని, పెద్ద తోపుని, స్టార్ క్రికెటర్ ను ఏమైనా చేయొచ్చు అనుకుంటే మాత్రం పబ్లిక్ నుంచి ఛీత్కారాలే మిగులుతాయి. ప్రస్తుతం భారత క్రికెటర్ హార్థిక్ పాండ్యా(Hardik Pandya) ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.
ఆటలో అద్భుతమైన ఆల్ రౌండర్ గా గుర్తింపు ఉన్న పాండ్యా తన ప్రవర్తనతో మాత్రం వివాదాల్లో నిలుస్తుంటాడు. ఇటీవల వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై విజయం తర్వాత భారత ఆటగాళ్లందరూ కుటుంబసభ్యులతో గ్రౌండ్ లోనే సంబరాలు చేసుకున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా హార్థిక్ పాండ్యా ప్రవర్తించిన తీరే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. తన గాళ్ ఫ్రెండ్ తో హార్థిక్ హద్దులు దాటి ప్రవర్తించాడు.
ఏదో సినిమా షూటింగ్లో హీరో హీరోయిన్లు రొమాంటిక్ సీన్స్‌లో నటిస్తున్నట్టు ట్రోఫీ తీసుకున్న పోడియంపైనే ఆమెతో రొమాన్స్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీల్లో, గ్రౌండ్ లో ఉన్న లక్షలాది మంది దీనిని చూసి ఛీదరించుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి.
అసలు ఇంత బరితెగింపా అంటూ హార్థిక్ పాండ్యా(Hardik Pandya)పై అందరూ మండిపడుతున్నారు. భుజంపై జాతీయ జెండా ఉంచుకుని మరీ గాళ్ ఫ్రెండ్ మహికాతో రొమాన్స్ లో మునిగిపోయాడు. మన చుట్టూ లక్షలాది మంది ఉన్నారన్న కనీస ఇంగితజ్ఞానం కూడా లేకుండా హద్దులు దాటేశాడు.
భారత క్రికెటర్లు చాలామంది తమ తమ కుటుంబసభ్యులతో ఈ విజయాన్ని హుందాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ట్రోఫీలతో ఫోటోలకు ఫోజులిచ్చి, అభిమానులను పలకరిస్తూ గ్రౌండ్ లో సందడి చేశారు. కానీ హార్థిక్ మాత్రం పోడియం వెనక్కి వెళ్లి దానినే బెడ్ రూమ్‌లా ఫీలై రొమాన్స్ చేయడం చాలా మందికి జుగుప్స కలిగించింది.

ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ గా మారడంతో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. నువ్వు ఎంత పెద్ద క్రికెటర్ అయినా పబ్లిక్ ప్లేస్ లో ఎలా ప్రవర్తించాలో తెలీదా.. అసలు బుద్ధుందా అంటూ మండిపడుతున్నారు. క్రికెటర్లు యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంటారని, అలాంటి సెలబ్రిటీ స్థానంలో ఉండి హార్థిక్ ఇలా దిగజారి ప్రవర్తించడం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు.
మైదానంలో అయినా, గ్రౌండ్ బయట అయినా హుందాగా ఉండడం నేర్చుకోవాలని సూచిస్తున్నారు. సచిన్, రోహిత్ , గంగూలీ వంటి దిగ్గజాల కంటే నువ్వు ఏం తోపు కాదుగా, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ అందరూ మెచ్చేలా ప్రవర్తించాలంటూ హార్థిక్ ను కడిగి పారేస్తున్నారు. మాజీ భార్య నటాషాకు విడాకులు ఇచ్చిన తర్వాత హార్థిక్ మహికా శర్మతో డేటింగ్ చేస్తున్నాడు.





