Shreyas : ఐర్లాండ్ చేతిలో ఓటమి..శ్రేయాస్ కు క్లాస్ పీకిన గంభీర్
Shreyas : కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తో చాలా సేపు సీరియస్ డిస్కషన్ జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. గ్రౌండ్ లో శ్రేయాస్ కెప్టెన్సీపై గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
Shreyas
క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఏ జట్టునూ తేలిగ్గా అంచనా వేయలేం. అందులోనూ టీ20 ఫార్మాట్ లో ఎవ్వరినీ ఫేవరెట్ గా చెప్పలేం. చిన్న జట్లను అస్సలు లైట్ తీసుకోలేం. ఒకవేళ తేలిగ్గా తీసుకున్నా, పరిస్థితులకు తగ్గట్టు ఆడకున్నా దిమ్మతిరిగే షాక్ తగులుతుంది. ప్రస్తుతం ఐర్లాండ్ చేతిలో టీ20 వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియాకు ఇదే పరిస్థితి ఎదురైంది.
ఐర్లాండ్ టూర్ లో చెలరేగిపోతుందనుకున్న భారత్ తుస్సుమనిపించింది. 34 రన్స్ తేడాతో భారత్ ను మట్టికరిపించిన ఐర్లాండ్ దెబ్బకు భారత డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ అనూహ్య ఓటమితో షాక్ తిన్న టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా కెప్టెన్ శ్రేయాస్(Shreyas) అయ్యర్ తో చాలా సేపు సీరియస్ డిస్కషన్ జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. గ్రౌండ్ లో శ్రేయాస్ కెప్టెన్సీపై గంభీర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపైనే శ్రేయాస్ అయ్యర్ కు అతను క్లాస్ పీకినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఈ వీడియోలో గంభీర్, శ్రేయాస్(Shreyas) తో సీరియస్ గా ఏదో అంటున్నట్టు కనిపిస్తోంది. ఇది నిజం వీడియోనా లేక ఏఐ వీడియోానా అన్నది తెలియడం లేదు. కానీ ఐర్లాండ్ తో ఓటమి తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం మాత్రం గంభీరంగా మారిపోయింది. నిజానికి ఐర్లాండ్ ను తేలిగ్గా తీసుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది విశ్లేషిస్తున్నారు.

అలాగే ఐర్లాండ్ పిచ్ లకు తగ్గట్టు సరైన ప్రిపరేషన్ లేకపోవడం, వారి పేస్, స్వింగ్ ను సరిగ్గా ఎదుర్కోలేకపోవడం కూడా ఓటమికి కారణంగా చెప్పొచ్చు. సీనియర్ ఆటగాళ్లు లేకుండా యువ జట్టుతో బరిలోకి దిగిన భారత్ కు ఈ ఓటమి మేల్కొలుపు లాంటిదనే చెప్పాలి. శ్రేయాస్(Shreyas) అయ్యర్ కెప్టెన్సీకి కూడా ఈ సిరీస్, తర్వాత ఇంగ్లాండ్ తో జరగబోయే సిరీస్ లు పెద్ద పరీక్షగానే భావిస్తున్నారు.
ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తప్పిదాలు రిపీట్ చేయకుండా అదరగొట్టాలని టీమిండియా భావిస్తోంది. రెండో టీ20లో పూర్తి సామర్థ్యంతో ఆడి సిరీస్ ను సమం చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Numerology : నెంబర్ 8 అంటే నష్టమా, అదృష్టమా? శని దేవుడి నీడలో వారి జీవితం ఎలా ఉంటుంది?





