Just SportsLatest News

GT vs CSK : గుజరాత్ టైటాన్స్ జోరు..చెన్నై సూపర్ కింగ్స్ ఔట్

GT vs CSK : ఐపీఎల్ 2026 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ అధికారికంగా ఎలిమినేట్ అయింది. డూ ఆర్ డై మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లు చిత్తుచిత్తుగా ఓడిపోయారు

GT vs CSK

ఐపీఎల్ 19వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసింది. చివరి మ్యాచ్ లో గెలిచి ఏదైన అద్భుతం జరిగితే ప్లే ఆఫ్స్ కు చేరుతుందేమో అనుకున్న ఫ్యాన్స్ ను నిరాశపరుస్తూ గుజరాత్ టైటాన్స్(GT vs CSK) చేతిలో చిత్తుగా ఓడిపోయింది. బౌలర్లు విఫలమైన వేళ, బ్యాటర్లు సైతం చేతులెత్తేసిన వేళ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఈ భారీ విజయంతో గుజరాత్ 18 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

ఈ మ్యాచ్(GT vs CSK) లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో హోంగ్రౌండ్ లో మరోసారి భారీస్కోరు చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు గిల్ , సాయి సుదర్శన్ తమ సూపర్ ఫామ్ కొనసాగిస్తూ చెలరేగిపోయారు. వీరిద్దరూ పవర్ ప్లేలో 62 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. పవర్ ప్లే ముగిసిన తర్వాత మరింతగా రెచ్చిపోయారు.

ముఖ్యంగా గిల్ సీఎస్కే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. 37 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ కు బట్లర్ జత కలిసాడు. ఈ క్రమంలో సాయిసుదర్శన్ వరుసగా ఐదో హాఫ్ సెంచరీ బాదేశాడు. అటు బట్లర్ సైతం రెచ్చిపోయాడు.

ప్రతీ బౌలర్ నూ ఎడాపెడా ఉతికారేశాడు. ఫలితంగా సీఎస్కే స్పిన్నర్లు, పేసర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. చెన్నై స్పిన్నర్ నూర్ అహ్మద్ బౌలింగ్ లో అయితే సాయి సుదర్శన్ సిక్సర్లు బాదిన తీరు హైలైట్ గా నిలిచింది. సెంచరీ సాధిస్తాడనుకున్న సాయి సుదర్శన్ 53 బంతుల్లో 84 (7 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేసి అవుటయ్యాడు. తర్వాత బట్లర్ హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. కేవలం 27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.

GT vs CSK
GT vs CSK

ఛేజింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభం నుంచే తడబడింది. భారీ అంచనాలు పెట్టుకున్న సంజూ శాంసన్ డకౌటయ్యాడు. కాసేపటికే రుతురాజ్ గైక్వాడ్ (16), ఉర్విల్ పటేల్(0) కూడా వెనుదిరిగారు.అయితే షార్ట్ క్రీజులో ఉన్న కాసేపు భారీ షాట్లతో అలరించాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన కార్తీక్ శర్మ (19), బ్రెవిస్ (8) కూడా త్వరగానే ఔటయ్యారు.

ఈ దశలో శివమ్ దూబే విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే 47 (4 ఫోర్లు, 4 సిక్సర్లు) రన్స్ కు ఔటయ్యాడు. ఇక్కడ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. దీంతో చెన్నై ఇన్నింగ్స్ కు 140 పరుగుల దగ్గర తెరపడింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 , రషీద్ ఖాన్ 3 , రబాడ 3 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్ లో సీఎస్కే(GT vs CSK)కు ఇది ఎనిమిదో ఓటమి.

Cockroach Janta Party : కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతా బ్లాక్..తగ్గేదే లేదంటూ మరో అకౌంట్

Related Articles

Back to top button