Just SportsLatest News

GT vs PBKS : గుజరాత్ దూకుడు కొనసాగేనా ?..పంజాబ్ కింగ్స్ తో పోరు

GT vs PBKS : ఐపీఎల్ 19వ సీజన్ సెకండాఫ్ రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్ మ్యాచ్ కూ పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి

GT vs PBKS

ఐపీఎల్ 19వ సీజన్ సెకండాఫ్ రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్ మ్యాచ్ కూ పాయింట్ల పట్టికలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఫస్టాఫ్ లో వెనుకబడిన జట్లు పుంజుకుంటున్నాయి. దీనిలో భాగంగా గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో టాప్ 4లో చోటు కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం గుజరాత్ 9 మ్యాచ్ లలో ఐదు విజయాలు, 4 ఓటములతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

గత రెండు మ్యాచ్ లలోనూ టైటాన్స్ దుమ్మురేపింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లను చిత్తు చేసింది. ఈ రెండు విజయాలతోనే ఐదో ప్లేస్ కు దూసుకొచ్చింది. ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన గుజరాత్ ఆదివారం పంజాబ్ కింగ్స్ (GT vs PBKS)తో తలపడబోతోంది. వరుసగా రెండు విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న గుజరాత్ కు హోంగ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంది.

బ్యాటింగ్ లో గిల్ , సాయి సుదర్శన్, బట్లర్ అదరగొడుతున్నారు. వీరితో పాటు హోల్డర్, షారూఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్ , తెవాటియా కూడా దూకుడుగా ఆడే సత్తా ఉన్నవారే. వీరిలో ఇద్దరు చెలరేగినా గుజరాత్ కు తిరుగుండదు. అటు బౌలింగ్ లో రబాడ, సిరాజ్ తో పాటు అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్ లపై అంచనాలున్నాయి. బౌలింగ్ లో సమిష్టిగా రాణిస్తుండడం గుజరాత్ కు కలిసొచ్చే అంశం.

మరోవైపు పంజాబ్ కింగ్స్ కు గత మ్యాచ్ లో ఓటమి షాక్ అనే చెప్పాలి. సీజన్ ఆరంభం నుంచీ దుమ్మురేపుతున్న పంజాబ్ కు రాజస్థాన్ రాయల్స్ షాకిచ్చింది. బ్యాటింగ్ లో ప్రతీసారీ భారీస్కోర్లు ఛేజ్ చేస్తున్న ఆ జట్టు గత మ్యాచ్ లో పేలవ బౌలింగ్ తో భారీస్కోరును కాపాడుకోలేకపోయింది. దీంతో వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడినట్టయింది.

GT vs PBKS
GT vs PBKS

బ్యాటింగ్ పరంగా పంజాబ్ కు తిరుగు లేదు. అందరూ కలిసికట్టుగా రాణిస్తున్నారు. ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కూపర్ కన్నోలీ, స్టోయినిస్ ఇలా అంచనాలు పెట్టుకున్న ప్రతీ ప్లేయర్ సత్తా చాటుతున్నారు. అయితే బౌలింగే ఆందోళన కలిగిస్తోంది. వికెట్లు తీస్తున్నా పంజాబ్ బౌలర్లు పరుగులు ఇచ్చేస్తున్నారు.

రన్స్ కట్టడి చేయగలిగితే పంజాబ్ మళ్లీ గెలుపు బాట పటొచ్చు. మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దీంతో ఛేజింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్. గత రికార్డులను చూస్తే ఇరు జట్లు ఏడుసార్లు తలపడితే పంజాబ్(GT vs PBKS) నాలుగింటిలో గెలిచింది.

Chennai Super Kings : చెపాక్ లో చెన్నై చెడుగుడు..చిత్తుగా ఓడిన ముంబై

Related Articles

Back to top button