Just SportsLatest News

Gujarat Titans : గుజరాత్ ఆల్ రౌండ్ షో..ఆర్సీబీపై రివెంజ్ విక్టరీ

Gujarat Titans : ఐపీఎల్ 19వ సీజన్ సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ వరుస విజయాలతో అదరగొట్టిన జట్లకు ఓటములు ఎదురవుతున్నాయి

Gujarat Titans

ఐపీఎల్ 19వ సీజన్ సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటి వరకూ వరుస విజయాలతో అదరగొట్టిన జట్లకు ఓటములు ఎదురవుతున్నాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) ఆర్సీబీపై ప్రతీకారం తీర్చుకుంది. తమ హోంగ్రౌండ్ లో అదిరిపోయే విజయాన్ని అందుకుంది. బౌలింగ్ లో అర్షద్ ఖాన్, బ్యాటింగ్ లో గిల్, బట్లర్ రాణించారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారీస్కోర్లు సాధిస్తూ విజయాలను అందుకుంటున్న బెంగళూరు ఉత్సాహంగా బ్యాటింగ్ ప్రారంభించినా కాసేపటికే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు బెథెల్ , కోహ్లీ అనుకున్న స్థాయిలో ఆరంభాన్నివ్వలేకపోయారు. బెథెల్ (5), కోహ్లీ (2)8, జితేశ్ శర్మ (1), టిమ్ డేవిడ్ (9), కృనాల్ పాండ్యా (4) పరుగులకే ఔటయ్యారు. దీంతో బెంగళూరు దూకుడుగా ఆడినా 91 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.

ఓ దశలో 7.3 ఓవర్లలో 79/2 తో పటిష్ట స్థితిలో ఉన్న ఆర్సీబీ.. ఆ తర్వాత అనూహ్యంగా తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోయి.. అనుకున్నదానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది.ఈ దశలో దేవదత్ పడిక్కల్ మరోసారి ఆదుకున్నాడు. షెఫర్డ్ తో కలిసి 30 పరుగులు జోడించాడు.

గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించారు. ఫలితంగా ఆర్సీబీ కోలుకోలేకపోయింది. చివర్లో రొమారియో షెఫర్డ్ (17), వెంకటేశ్ అయ్యర్ (12), భువనేశ్వర్ కుమార్ (15) పోరాడటంతో ఆర్సీబీ 150 పరుగుల మార్కును దాటింది.

Gujarat Titans
Gujarat Titans

చివరకు 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయింది. దేవ్‌దత్ పడిక్కల్ 24 బంతుల్లో 40 రన్స్ చేసి, టాప్ స్కోరర్‌గా నిలిచాడు.గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అర్షద్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు. జేసన్ హోల్డర్ 2, రషీద్ ఖాన్ 2, మహమ్మద్ సిరాజ్ 1, కగిసో రబాడా 1 వికెట్ తీశారు. ఛేజింగ్ లో గుజరాత్ టైటాన్స్ దూకుడు గా ఆడింది.

రన్ రేట్ పెంచుకోవాలన్న లక్ష్యంతో బ్యాటింగ్ చేసింది. తొలి వికెట్ కు గిల్, సాయి సుదర్శన్ 3 ఓవర్లలోనే 42 పరుగులు జోడించారు. పవర్ ప్లేలోనే గుజరాత్ 69 పరుగులు చేసింది. గిల్ కేవలం 18 బంతుల్లోనే 43 రన్స్ చేశాడు. బట్లర్ 19 బంతుల్లో 39 పరుగులు చేయగా.. మిడిల్ ఓవర్లలో గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా లేకపోవడంతో తెవాటియా, రషీద్ ఖాన్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు.

Brown Sugar : వైట్ షుగర్, బ్రౌన్ షుగర్‌లో ఏది మంచిది? డయాబెటిస్ ఉన్నవాళ్లు బ్రౌన్ షుగర్ తినొచ్చా?

Related Articles

Back to top button