Just SportsLatest News

Hardik : ముంబైని వీడడం ఖాయమే..హార్దిక్‌ను దక్కించుకునే జట్టు అదేనా ?

Hardik : మరోసారి హార్దిక్ ట్రేడ్ డీల్ హాట్ టాపిక్ గా మారింది. అమౌంట్ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ స్టార్ ఆల్ రౌండర్ కోసం ఏడు ఫ్రాంఛైజీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

Hardik

ఐపీఎల్‌లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలుసు. ముంబైకి ఆడుతూ ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన హార్దిక్ గతంలో గుజరాత్ టైటాన్స్‌ను తొలి సీజన్‌లోనే ఛాంపియన్స్‌గా నిలిపాడు. తర్వాత ముంబై ఈ ఆల్ రౌండర్‌ను భారీ ట్రేడ్‌తో తిరిగి వెనక్కి తెచ్చుకుంది.

ఐపీఎల్ 2024 వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి రూ.15 కోట్ల పూర్తి నగదు రూపంలో ముంబై పాండ్యాను కొనుగోలు చేసింది. అధికారిక ఫీజుతో పాటు అప్రకటిత బదిలీ రుసుమును ముంబై చెల్లించింది, ఇందులో 50 శాతం వాటాను పాండ్యా అందుకున్నాడు. అప్పట్లో ఇది ఒక సంచలనం.

ఇప్పుడు మరోసారి హార్దిక్(Hardik) ట్రేడ్ డీల్ హాట్ టాపిక్ గా మారింది. అమౌంట్ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఈ స్టార్ ఆల్ రౌండర్ కోసం ఏడు ఫ్రాంఛైజీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. హార్దిక్ పాండ్యాను ట్రేడ్ ద్వారా సొంతం చేసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ రేసులో ముందు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఎందుకంటే సీఎస్కేకు ఆల్ రౌండర్ల కొరత ఉంది. జట్టులో ఉన్నవారెవరూ తమ పాత్రకు న్యాయం చేయలేకపోతున్నారు. అందుకే గత రెండు సీజన్లలోనూ తీవ్రంగా నిరాశపరిచింది. హార్దిక్ లాంటి మ్యాచ్ విన్నింగ్ ఆల్ రౌండర్ కోసం చెన్నై చివరి వరకూ ప్రయత్నించే అవకాశముంది.

చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ పాండ్యాపై కన్నేసినట్టు సమాచారం. రహానే కెప్టెన్సీలో కేకేఆర్ పెద్దగా రాణించలేదు. వ్యక్తిగతంగా పర్వాలేదనిపించినా సారథిగా మాత్రం రహానే జట్టును గెలుపు బాటలో నడిపించలేకపోయాడు. దీంతో హార్దిక్‌(Hardik)ను తీసుకుని కెప్టెన్సీ అప్పగించాలని కేకేఆర్ భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Hardik
Hardik

అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ కూడా లాంగ్ టర్మ్ ప్లాన్స్‌లో భాగంగా హార్దిక్‌ను తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కాగా పాండ్యా మూడు సీజన్లలో పెద్దగా రాణించలేదు. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడతూ సాగుతున్నాడు. దీని కోసం ముంబై నుంచి బెంగళూరుకు షిప్ట్ అయిపోయాడు. ఇప్పటి వరకూ హార్దిక్ తన ఐపీఎల్ కెరీర్‌లో 162 మ్యాచ్‌లు ఆడి 2955 పరుగులు చేశాడు. బౌలింగ్‌లోనూ రాణించి 82 వికెట్లు పడగొట్టాడు.

Whatsapp : వాట్సాప్‌కు కేంద్రం బిగ్ షాక్..ఆ ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం

Related Articles

Back to top button