Just SportsLatest News

IND vs AFG : సిరీస్ విజయమే లక్ష్యం..ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ రెండో వన్డే

IND vs AFG : తొలి వన్డేలో పెద్దగా పోటీనివ్వలేకపోయిన ఆఫ్ఘన్ టీమ్ ఈ మ్యాచ్ లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది

IND vs AFG

సొంతగడ్డపై ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ లో శుభారంభం చేసిన భారత్(IND vs AFG) ఇప్పుడు రెండో మ్యాచ్ కు సిద్ధమైంది. లక్నో ఎకానా క్రికెట్ స్టేడియం వేదికగా బుధవారం ఇరు జట్లు తలపడబోతున్నాయి. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన తొలి వన్డేలో భారత్ పూర్తి ఆధిపత్యం కనబరిచి ఘనవిజయాన్ని అందుకుంది.

బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ , కే ఎల్ రాహుల్, రాణించారు. ఓపెనర్ రోహిత్ శర్మ ఫామ్ అందుకోవాల్సి ఉండగా.. మిగిలిన బ్యాటర్లకు అవకాశం రాలేదు. 195 పరుగుల టార్గెట్ ను భారత్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. అంతకుముందు బౌలింగ్ లోనూ సమిష్టిగా రాణించింది.

ఆ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే ఆకట్టుకున్నారు. కీలక వికెట్లు పడగొట్టి తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గుర్నూర్ బ్రార్ 2 వికెట్లు, హర్ష్ దూబే 3 వికెట్లు పడగొట్టారు. మిగిలిన బౌలర్లలో అర్షదీప్ సింగ్, నితీశ్ కుమార్ రెడ్జి కూడా రాణించారు. జైస్వాల్ , కుల్దీప్ యాదవ్ తో పాటు ప్రిన్స్ యాదవ్ బెంచ్ కే పరిమితమయ్యారు. సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న టీమిండియా తుది జట్టులో మార్పులు చేయకపోవచ్చు.

అయితే ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ శర్మ గాయపడడం టెన్షన్ పెడుతోంది. మణికట్టు గాయంతో ఇబ్బంది పడుతున్న హిట్ మ్యాన్ ను ఆడిస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ రోహిత్ ను తప్పిస్తే జైస్వాల్ తుది జట్టులోకి వస్తాడు. ఈ మ్యాచ్ తోనే సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. తర్వాత చివరి వన్డేలో రిజర్వ్ ఆటగాళ్లకు అవకాశమివ్వాలని హెడ్ కోచ్ గంభీర్ భావిస్తున్నాడు.

IND vs AFG
IND vs AFG

మరోవైపు తొలి వన్డేలో ఆఫ్ఘన్ బ్యాటింగ్ కు సంబంధించి గుర్బాజ్ సెంచరీ బాదేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా దూకుడుగా ఆడి శతకం సాధించాడు. అతని విధ్వంసం కారణంగానే ఆఫ్ఘనిస్తాన్ ఏ స్కోరు 150 దాటగలిగింది. దీంతో మిగిలిన బ్యాటర్లు కూడా రాణించాల్సిన అవసరం ఉంది. నబీ వంటి సీనియర్ ఆటగాడు కూడా ఫామ్ అందుకోవాలి.

అటు బౌలింగ్ లో రషీద్ ఖాన్ పై అంచనాలున్నాయి. తొలి వన్డేలో పెద్దగా పోటీనివ్వలేకపోయిన ఆఫ్ఘన్ టీమ్ ఈ మ్యాచ్ లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న ఎకానా స్టేడియం బ్యాటర్లకు, బౌలింగ్ కు సమానంగా అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు. 280 ప్లస్ స్కోర్ చేస్తే ఈ పిచ్ పై డిఫెండ్ చేసుకోవచ్చని చెబుతున్నారు

Netanyahu : ట్రంప్ డీల్‌పై ఇజ్రాయిల్ గరంగరం.. ఇరాన్‌ను వదలనంటున్న నెతన్యాహు

Related Articles

Back to top button