Just SportsLatest News

T20 World Cup Final : టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు కౌంట్ డౌన్.. టైటిల్ పోరుకు భారత్,కివీస్ రెడీ

T20 World Cup Final : టీ20 వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ను న్యూజీలాండ్ ఎదుర్కోనుంది.

T20 World Cup Final

నెలరోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్(T20 World Cup Final) మ్యాచ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, న్యూజిలాండ్ తలపడబోతున్నాయి. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారీ అంచనాల మధ్య టోర్నీలో అడుగుపెట్టిన టీమిండియా దానికి తగ్గట్టే రాణిస్తూ ఫైనల్ కు చేరుకుంది.

ఆరంభంలో అమెరికా మ్యాచ్ లో తడబడినా తర్వాత పుంజుకుని వరుసగా విజయాలతో గ్రూప్ స్టేజ్ ను అగ్రస్థానంతో ముగించింది. అయితే సూపర్ 8లో మాత్రం భారత్ కు ఊహించని విధంగా చుక్కెదురైంది. సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయి అసలు సెమీస్ కు చేరుతుందా అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. తర్వాత పుంజుకుని వరుస విజయాలతో దర్జాగా సెమీస్‌కు చేరడం, అక్కడ ఇంగ్లాండ్‌ను ఓడించి ఇప్పుడు వరల్డ్ కప్ కు అడుగుదూరంలో నిలిచింది. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉందా ఉంటే వెంటనే అవునని చెప్పలేని పరిస్థితి. ఫైనల్ కు ముందు భారత్ కు కూడా కొన్ని సమస్యలున్నాయి.

అభిషేక్ శర్మ ఫామ్.. ఇప్పటి వరకూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య.. బౌలింగ్ అసలు అనుకున్నస్థాయిలో లేకపోవడం.. ఇవే వెంటాడుతున్న బలహీనతలు. ఆదివారం న్యూజిలాండ్ తో ఫైనల్లో వీటిని అధిగమించగలిగితే మరోసారి భారత్ ప్రపంచకప్ అందుకోవడం ఖాయం. అదే సమయంలో మనకు అంతగా కలిసిరాని అహ్మదాబాద్ స్టేడియంలో అందులోనూ ఫైనల్లో ఉండే ఒత్తిడిని అధిగమించడంపైనే భారత్ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ లైనప్ చూస్తే అభిషేక్ శర్మ పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. టైటిల్ పోరులో అభిషేక్ షేక్ ఆడిస్తే మాత్రం తిరుగుండదు. సంజూ శాంసన్ సూపర్ ఫామ్ లో ఉండగా.. ఇషాన్ కిషన్ టచ్ లోకి వచ్చాడు. సూర్యకుమార్ , హార్థిక్ పాండ్యా , తిలక్ వర్మ, దూబే కూడా కలిస్తే మళ్లీ భారీస్కోరు ఖాయం.

అటు బౌలింగ్ లో మాత్రం కాస్త ఆందోళన నెలకొన్న మాట వాస్తవమే. బుమ్రా తప్పిస్తే మిగిలినవారంతా నిరాశపరుస్తున్నారు. వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు ఇచ్చేస్తుండడం కలవరపెడుతోంది. ఫీల్డింగ్ పరంగా సెమీఫైనల్ తోమెరుగైన మార్కులే వచ్చాయి. కాగా తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు లేనట్టే. అభిషేక్ శర్మపై మేనేజ్ మెంట్ నమ్మకముంచింది. అయితే వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ ను తీసుకునే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.

T20 World Cup Final
T20 World Cup Final

మరి విన్నింగ్ కాంబినేషన్ ను మార్చే అలవాటు లేని గంభీర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. మరోవైపు ఈ మెగాటోర్నీలో న్యూజిలాండ్ కూడా బాగానే ఆడుతోంది. సూపర్ 8 లో ముందు వెనుకబడినా తర్వాత మెరుగైన రన్ రేట్ తో సెమీస్‌కు చేరింది. సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై కివీస్ దుమ్మురేపింది. ఫిన్ అలెన్ సెంచరీతో చెలరేగిపోతే..సఫారీలు చిత్తుగా ఓడిపోయారు.

ఫలితంగా టీ20 ప్రపంచకప్ ఫైనల్(T20 World Cup Final) మ్యాచ్ కు ముందు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న కివీస్ కు ఓపెనర్లు సిఫెర్ట్ , ఫిన్ అలెన్ తో పాటు గ్లెన్ ఫిలిప్స్, శాంట్నర్, రచిన్ రవీంద్ర కీలకంగా భావిస్తున్నారు. ఇక అహ్మదాబాద్ పిచ్ ను మిక్సిడ్ వికెట్ గా రూపొందిస్తున్నారు. దీని ప్రకారం చూస్తే బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా అనుకూలించే అవకాశముంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button