IND vs SL : అడ్డుపడిన వరుణుడు .. అయినా భారత్ భారీ స్కోరు
IND vs SL : రెండో రోజు వర్షం కారణంగా ఒకటిన్నర సెషన్ ఆట రద్దయింది. కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమయింది.
IND vs SL
భారత్ , శ్రీలంక తొలి టెస్టును వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. రెండో రోజు వర్షం కారణంగా ఒకటిన్నర సెషన్ ఆట రద్దయింది. కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమయింది. అయితే రెండో రోజూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. పడిక్కల్ భారీ సెంచరీ(167) కి తోడు ధృవ్ జురెల్ హాఫ్ సెంచరీ, టెయిలెండర్లు కూడా ఓ మోస్తరుగా రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
రెండో రోజు తొలి సెషన్ పూర్తిగా వర్షంతో రద్దయింది. రెండో సెషన్‌లో సగం కూడా వర్షంతోనే తుడిచిపెట్టుకుపోయింది. మ్యాచ్ ఆరంభమైన తర్వాత పడిక్కల్ , పంత్ ఇన్నింగ్స్ కొనసాగించారు. వీరిద్దరూ 71 పరుగులు పార్టనర్‌షిప్ నెలకొల్పారు.
పంత్ 39 పరుగులకు ఔట్ అయ్యాక తొలి రోజు గాయంతో రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్ మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే తన ఓవర్ నైట్ స్కోరుకు మరో 5 పరుగులు మాత్రమే జోడించి ఔట్ అయ్యాడు. మరోవైపు తొలి డబుల్ సెంచరీ సాధించేలా కనిపించిన పడిక్కల్ స్టంప్ అవుటయ్యాడు.
మొత్తంగా ఈ కర్ణాటక బ్యాటర్ 230 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 167 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పడిక్కల్ ఓ అరుదైన ఘనత అందుకున్నాడు. శ్రీలంకపై టెస్టుల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 150 ప్లస్ స్కోరు సాధించిన మూడో భారత బ్యాటర్‌గా పడిక్కల్ చరిత్ర సృష్టించాడు.

తర్వాత జడేజా (13) నిరాశ పరిచినా , మానవ్ సుతార్‌తో కలిసి జురెల్ ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. వీరి జోడీ 55 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. హఫ్ సెంచరీ చేసిన జురెల్ ఔట్ అయిన తర్వాత సిరాజ్ (11) , సుతార్ (24) పరుగులకు వెనుదిరిగారు. అయితే కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ చివరి వికెట్ పడకుండా ఆటను ముగించారు.
దీంతో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 460 పరుగులు చేసింది. క్రీజులో కుల్‌దీప్ యాదవ్ (12), ప్రసిధ్ కృష్ణ (1) ఉన్నారు. లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు, కేశర నువంత 3 వికెట్లు పడగొట్టారు. సుమారు ఐదు గంటల ఆలస్యం తర్వాత మ్యాచ్ ప్రారంభం కాగా, కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది
El Nino : 1950 తర్వాత ఎప్పుడూ లేనంత డేంజర్..రైతులను దెబ్బకొడుతున్న ఎల్ నినో..





