Just Internationaljust AnalysisLatest News

El Nino : 1950 తర్వాత ఎప్పుడూ లేనంత డేంజర్..రైతులను దెబ్బకొడుతున్న ఎల్ నినో..

El Nino : వర్షాలను ఊడ్చేసే ఎల్ నినో అనే ప్రకృతి భూతం 2026 అక్టోబర్ నుంచి డిసెంబర్ నాటికి.. మరింత విశ్వరూపం చూపించనుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

El Nino

వర్షాల కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్న రైతులకు పసిఫిక్ మహాసముద్రం నుంచి ఒక వార్నింగ్ బెల్ మోగింది. వర్షాలను ఊడ్చేసే ఎల్ నినో అనే ప్రకృతి భూతం రోజురోజుకు పంజా విసురుతోంది. అయితే ముఖ్యంగా 2026 అక్టోబర్ నుంచి డిసెంబర్ నాటికి.. మరింత విశ్వరూపం చూపించనుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

1950 తర్వాత నమోదైన మిగిలిన ఎల్ నినోల(El Nino) కంటే కూడా దీని తీవ్రత ఏకంగా 69 శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని యూఎస్ యొక్క ఎన్ఓఏఏ (NOAA) కంపెనీ తేల్చిచెప్పింది.

ఇదే విషయాన్ని తాజాగా భారత భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కూడా పార్లమెంటు వేదికగా వెల్లడించడంతో మరింత ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు తలెత్తి వర్షాలు కరవయ్యే డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.

అసలు ఈ ఎల్ నినోకి(El Nino) ఆ పేరెందుకు వచ్చిందంటే..లాటిన్ భాషలో ఎల్ నినో అంటే చిన్న పిల్లాడు లేదా యేసు క్రీస్తు అని అర్థం. డిసెంబర్ నాటికల్లా పసిఫిక్ మహాసముద్రంలో నీరు వేడెక్కే ఆర్డర్‌ను పెరూ దేశపు జాలర్లు పసిగట్టి ఎల్ నినో అనే పేరు పెట్టారు. పసిఫిక్ సముద్ర ఉపరితల నీళ్లు అసాధారణంగా వేడెక్కినప్పుడు ఈ ఎల్ నినో పుట్టుకొస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.

ఇది మొదలైతే చాలు ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ చక్రం మొత్తం తలకిందులవుతుంది. వర్షాలు పడాల్సిన చోట తీవ్ర కరవు, పొడిగా ఉండే చోట వరదలు రావడం దీని లక్షణంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన నైరుతి రుతుపవనాలను కూడా ఎల్ నినో దారుణంగా దెబ్బతీస్తోంది. ఐఎమ్‌డీ (IMD) లెక్కల ప్రకారం జూన్ 1 నుంచి ఆగస్టు 14 మధ్య భారత దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో కేవలం 90 శాతం మాత్రమే నమోదు అయింది. ఇది సాధారణం కంటే చాలా అంటే చాలా తక్కువగా చెప్పొచ్చు .

అయితే ఈ ఎల్ నినో విలన్ వంటి వార్తల మధ్య భారత దేశ రైతులకు ఆశలు చిగురించే ఒక అంశం కూడా లభించింది. నైరుతి రుతుపవనాలకు చెక్ పెట్టినా కూడా, అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలంలో వచ్చే ఈశాన్య రుతుపవనాలపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీనివల్ల ముఖ్యంగా దక్షిణ భారతంలోని ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ఈశాన్య రుతుపవనాల ద్వారా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది.

El Nino
El Nino

ఎల్ నినో గురించి మరో పెద్ద ఉపశమనం ఏంటంటే.. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ సిట్యువేషన్స్ చాలా బలంగా రూపుదిద్దుకుంటూ ఉండటంతో.. సైంటిస్టులు దీనిని నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఒకవేళ ఈ ఓషన్ డైపోల్ కనుక అక్కడే బలంగా స్థిరపడితే, దక్షిణాది రాష్ట్రాలపై ఎల్ నినో చూపే తీవ్ర నెగిటివ్ ఎఫెక్ట్ బాగా తగ్గిపోతుంది. వర్షాలు పడటానికి పర్ఫెక్ట్ వాతావరణం సెట్ అవుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో వర్షాలు పడి పంటలు పండటానికి అనుకూల సూచనలు ఇంకా సజీవంగానే ఉన్నట్లు హోప్స్ పెట్టుకోవచ్చు.

Yashasvi Jaiswal : సచిన్, మంజ్రేకర్ క్లబ్‌లో జైస్వాల్..తొలి సెంచరీతో దేవదత్ పడిక్కల్ రికార్డుల వేట

Related Articles

Back to top button