Just SportsLatest News

India-Bangladesh Semi Final : నేడే సెమీఫైనల్ పోరు.. ఫైనల్ బెర్త్ మనదేనా?

India-Bangladesh Semi Final : హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా దుబాయ్ పిచ్ ..స్పిన్ బౌలింగ్‌కు బాగా ఫేవరబుల్‌గా ఉంటుంది.

India- Bangladesh Semi Final

మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ది మోస్ట్ ఎక్సైటింగ్ ఘట్టానికి చేరుకుంది. ఇప్పటి వరకూ తిరుగులేని డామినేషన్‌ను ప్రదర్శించిన భారత మహిళల జట్టు ఈరోజు జరగబోయే మొదటి సెమీఫైనల్ పోరులో బంగ్లాదేశ్‌తో తలపడబోతోంది.

గురువారం రాత్రి 8 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడొచ్చు. లీగ్ స్టేజిలో ఆడిన మూడింటికి మూడు మ్యాచులు గెలిచిన టీమిండియా గ్రాండ్‌గా సెమీస్‌లో అడుగుపెట్టగా.. బంగ్లాదేశ్ మాత్రం ఆడిన మూడింటిలో రెండు మ్యాచుల్లో విజయం సాధించి ఒకదాంట్లో ఓడిపోయింది.

బలాబలాల పరంగా చూస్తే కనుక హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భారత్‌కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా దుబాయ్ పిచ్ ..స్పిన్ బౌలింగ్‌కు బాగా ఫేవరబుల్‌గా ఉంటుంది. కాకపోతే భారత బ్యాటర్లకు సవాల్ విసిరే స్పిన్ దళం ..బంగ్లాదేశ్ టీమ్‌లో కూడా ఉండటంతో మనవాళ్లు కాస్త జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.

గ్రూప్ స్టేజిలో మన స్పిన్ త్రయమైన తెలుగు అమ్మాయి శ్రీచరణి, దీప్తి శర్మ, ప్రేమ రావత్ .. ప్రత్యర్థి బ్యాటర్లను గజగజలాడించారు. ఈ ముగ్గురూ కలిసి ఏకంగా 20 వికెట్లు నేలకూల్చడం విశేషంగా నిలిచింది. పార్ట్ టైమ్ స్పిన్నర్ షఫాలీ వర్మ కూడా ఫామ్‌లోకి వచ్చి వికెట్లు పడగొడుతుండటం జట్టుకు పెద్ద అసెట్ అయింది.

అటు పేస్ విభాగంలో క్రాంతి గౌడ్, నందని శర్మ స్టేబుల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. నిజానికి నిగర్ సుల్తానా లీడర్ షిప్‌లోని బంగ్లాదేశ్‌కు భారత స్పిన్ దాడిని తట్టుకోవడం తలకు మించిన భారమే అవుతుంది.

India-Bangladesh Semi Final
India-Bangladesh Semi Final

అయితే ఇండియన్ టీమ్‌ను బ్యాటర్ల నిలకడలేమి మెయిన్ ప్రాబ్లెమ్‌గా వేధిస్తోంది. షఫాలీ వర్మ, స్మృతి మంధాన చెరో మ్యాచ్‌లో మెరిసినా కూడా.. ప్రతీకా రావల్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వికెట్ కీపర్ రిచా ఘోష్ ఇప్పటివరకు ఆశించిన రేంజ్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేదు.

హెడ్-టు-హెడ్ రికార్డులను ఒకసారి పరిశీలిస్తే ఇప్పటివరకు రెండు జట్లు 24 టీ20 మ్యాచ్‌ల్లో ఫేస్ టు ఫేస్ తలపడగా ఇండియా ఏకంగా 21 మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది, బంగ్లాదేశ్ మాత్రం కేవలం 3 మ్యాచ్‌ల్లోనే నెగ్గింది. సెమీస్‌లో భారత బ్యాటర్లు బాగా రాణించి మంచి స్కోరు సాధిస్తే, ఫైనల్ బెర్త్‌ ఫిక్స్ అవడంతో పాటు ఆసియా కప్ ట్రోఫీకి మరో అడుగు దూరంలోనే నిలుస్తాం.

AQP4 Gene : రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదా?..నైట్ టైమ్‌లో బ్రెయిన్‌లో జరిగే ‘జీన్’ కథ తెలుసుకోండి..

Related Articles

Back to top button