Just EntertainmentLatest News

Ustad Bhagat Singh:గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కుద్ది.. ఉస్తాద్ భగత్ సింగ్ అసలు కథ ఇదేనా?

Ustad Bhagat Singh:టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ..ఉస్తాద్ భగత్ సింగ్.. నామస్మరణే వినిపిస్తోంది.

Ustad Bhagat Singh

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ..ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh).. నామస్మరణే వినిపిస్తోంది. గబ్బర్ సింగ్ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇది విజయ్ నటించిన తేరికి.. రీమేక్ అనే ప్రచారం గట్టిగా సాగింది.

ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతుండటంతో, పవర్ స్టార్ ఫ్యాన్స్ అప్పుడే సెలబ్రేషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఇలాంటి సమయంలోనే  ఇప్పుడు ఈ సినిమా దేనికీ రీమేక్ కాదని, పక్కా ఒరిజినల్ స్టోరీ అని తేలిపోయింది. ప్రముఖ టికెటింగ్ పోర్టల్ బుక్ మై షో ఈ మూవీ స్టోరీకి సంబంధించి ఇచ్చిన అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బుక్ మై షో రివీల్ చేసిన స్టోరీ ప్రకారం చూస్తే.. ఇది ఒక గిరిజన యువకుడి పోరాట గాథ అని తేలింది. భగత్ సింగ్ అనే యువకుడు తన గురువు నేర్పిన నైతిక విలువలతో, సొసైటీ కోసం బాధ్యతగా ఉండాలనే ఆలోచనలో ఉంటాడు. అయితే తన కళ్లముందే జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను చూసి తట్టుకోలేక, వాటిని ఎదుర్కోవాలంటే తనకు అధికారం ఉండాలని భావిస్తాడు.

ఇలాంటి వ్యవస్థను మార్చడానికి ఖాకీ దుస్తులే సరైన ఆయుధమని నమ్మి పోలీస్ ఆఫీసర్ అవుతాడు.మొత్తంగా ఇలా ప్రజల కోసం నిరంతరం పోరాడే ఒక యోధుడి (Warrior) కథే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ అని తేలిపోయింది. దీంతో గతంలో ప్రచారమైన ఫ్యామిలీ రివెంజ్ డ్రామా అని వినిపించిన వార్తలకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడినట్లు అయింది. హరీష్ శంకర్ కూడా ఈ సినిమాకు తన మార్క్ డైలాగ్స్, స్క్రీన్ ప్లేతో పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా తీర్చిదిద్దడంతో పవన్ ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Ustad Bhagat Singh
Ustad Bhagat Singh

ఇక టెక్నికల్ విషయానికి వస్తే, ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh) మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (BGM) ఇస్తున్నారు. ఇప్పటికే రిలీజయిన గ్లింప్స్ లో గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది వంటి డైలాగ్స్ పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ పాలిటిక్స్‌కు కూడా దగ్గరగా ఉండటంతో ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ పెరిగిపోయింది.

మరోవైపు రాశిఖన్నా, శ్రీలీల పవన్ సరసన హీరోయిన్లుగా నటిస్తుండగా.. తమిళ నటుడు పార్తిబన్ విలన్‌గా కనిపించబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటోంది. ముందుగా అనుకున్న సమయం కంటే వారం ముందే, అంటే ఈ నెల మార్చి 19న ఉగాది పర్వదినాన రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ సునామీ ఖాయమని ట్రేడ్ వర్గాలు గట్టిగానే అనుకుంటున్నాయి.

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button