India : టీమిండియాకు బిగ్ షాక్..ఐర్లాండ్ సంచలన విజయం
India : ఐర్లాండ్ భారత్‌పై సంచలన విజయం సాధించింది. సొంతగడ్డపై ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన ఐర్లాండ్ చారిత్రక విజయాన్ని అందుకుంది
India
టీ ట్వంటీ వరల్డ్ ఛాంపియన్స్ టీమిండియాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. పసికూన ఐర్లాండ్ భారత్ పై సంచలన విజయం సాధించింది. సొంతగడ్డపై ఆల్ రౌండ్ షోతో అదరగొట్టిన ఐర్లాండ్ చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో భారత్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది.
ఆరంభంలో ఐర్లాండ్ వికెట్లు తీసినా తర్వాత బౌలర్లు పట్టుజారవిడిచారు. ఫలితంగా భారీస్కోరు చేసిన ఐరిష్ టీమ్ అదే జోష్ తో బౌలింగ్ లోనూ సత్తా చాటింది. కీలక బ్యాటర్లను త్వరగా ఔట్ చేసి పైచేయి సాధించింది. టాస్ గెలిచిన భారత్(India) బౌలింగ్ ఎంచుకుంది. అందరూ ఎదురుచూస్తున్నట్టు వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు.
ఓపెనింగ్ కాంబినేషన్ ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేని భారత్(India) వైభవ్ ను ఫైనల్ ఎలెవన్ లోకి తీసుకోలేదు. ఆరంభం నుంచే ఐర్లాండ్ ను భారత పేసర్ హర్షిత్ రాణా కంగారెత్తించాడు. గాయం నుంచి కోలుకుని తిరగొచ్చిన హర్షిత్ రాణా, అర్షదీప్ తో కలిసి ఐరిష్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపాడు. దీంతో ఐర్లాండ్ 51 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయింది.
దీంతో కనీసం 120 పరుగులైనా చేస్తుందా అంటూ చాలా మంది అనుకున్నారు. ఈ దశలో కెప్టెన్ టకర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. గారెత్ తో కలిసి కీలకమైన 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టకర్ 36 బంతుల్లో 50 (5 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్ కు ఔటవగా.. తర్వాత గారెత్ (49), డాక్ రెల్ తో కలిసి 49 పరుగులు జోడించారు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమవుతుందనుకున్న ఐర్లాండ్ 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 3, అర్షదీప్ సింగ్2, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.
183 పరుగుల లక్ష్యఛేదనలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియా చాలా ఈజీగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఐర్లాండ్ బౌలర్లు భారత్ కు షాకిచ్చారు. పవర్ ప్లేలోనే ముగ్గురు కీలక బ్యాటర్లను పెవిలియన్ కు పంపారు. సంజూ శాంసన్ (5), ఇషాన్ కిషన్ (1), శ్రేయాస్ అయ్యర్ (3) నిరాశపరిచారు.

ఒకవైపు వికెట్లు పడుతున్నా అభిషేక్ శర్మ మాత్రం విధ్వంసం సృష్టించాడు. ఐర్లాండ్ బౌలర్లపై హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. కేవలం 20 బంతుల్లోనే 50 (7 ఫోర్లు, 2 సిక్సర్లు) రన్స్ చేసి ఔటయ్యాడు.
పవర్ ప్లేలో భారత్ 68 పరుగులు చేయడంతో గెలిచేలా కనిపించింది. తిలక్ వర్మ(19), వాషింగ్టన్ సుందర్(9), అక్షర్ పటేల్(15) వెంటవెంటనే ఔటవడంతో మ్యాచ్ ఐర్లాండ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. శివమ్ దూబే కాసేపు ధాటిగా ఆడే ప్రయత్నంలో 25 రన్స్ చేసినా ఫలితం లేకపోయింది. చివరకు భారత్ 148 పరుగులకు ఆలౌటైంది. భారత్(India) పై ఐర్లాండ్ కు ఏ ఫార్మాట్ లోనైనా ఇదే తొలి విజయం.
Divorce : విడిపోవాలనుకుంటే 6 నెలలు ఆగక్కరలేదు.. కూలింగ్ పీరియడ్‌పై మరోసారి చర్చ





