Jasprit Bumrah : బుమ్రా లేకుంటే అంతేనా ?..తేలిపోతున్న భారత యువబౌలర్లు
Jasprit Bumrah : ఇన్నింగ్స్ డెత్ ఓవర్లలో యార్కర్లు, స్లో బాల్స్‌తో పరుగులను నియంత్రించడంలో బుమ్రా దిట్ట. ఆ తరహా బౌలింగ్‌ను వేయడంలో మిగిలిన బౌలర్లు పూర్తిగా తేలిపోతున్నారు.
Jasprit Bumrah
జస్ప్రీత్ బుమ్రా.. భారత జట్టులో అత్యంత కీలకమైన బౌలర్. అతను బౌలింగ్ చేస్తున్నాడంటే ప్రత్యర్థి బ్యాటర్లకు ఇబ్బందులే. షాట్లు కొట్టడం సంగతి అటుంచి ముందు వికెట్ కాపాడుకోవడమే బ్యాటర్లకు పెద్ద సవాల్. బుమ్రా జట్టులో ఉన్నప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది.
బౌలింగ్ లైనప్‌ను ముందుండి నడిపించడంలో, యార్కర్లు, స్లో బంతులతో వికెట్లు తీయడంలో జస్ప్రీత్ బుమ్రా దిట్ట. ముఖ్యంగా పవర్ ప్లేలోనూ, డెత్ ఓవర్లలోనూ అద్భుతంగా రాణించే సత్తా అతని సొంతం. అలాంటి బుమ్రా తుది జట్టులో లేకపోతే మాత్రం భారత్ బౌలింగ్ బలహీనంగా మారిపోతోంది. అతనికి ప్రత్యామ్నాయంగా ఒక్కరూ లేకపోవడం టీమిండియాకు ఇబ్బందిగా మారింది. తాజాగా ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో ఇది మరోసారి రుజువైంది. వికెట్లు పడగొట్టడానికి చాలా శ్రమించారు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ లాంటి యువ పేసర్లు ఒత్తిడిని తట్టుకోవడంలో ఇబ్బంది పడడం మరోసారి స్పష్టంగా కనిపించింది.
జస్ప్రీత్ బుమ్రా లేకపోతే భారత బౌలింగ్ విభాగం పూర్తిగా బలహీనపడుతుందనేది గణాంకాలు కూడా చెబుతున్నాయి. బుమ్రా ఒక ఎండ్ నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లపై విపరీతమైన ఒత్తిడి తెస్తాడు. ఇది అవతలి ఎండ్‌లో ఉండే బౌలర్లకు వికెట్లు తీయడానికి అడ్వాంటేజ్‌గా మారుతుంది. అతను లేకపోతే మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు.
ముఖ్యంగా ఇన్నింగ్స్ డెత్ ఓవర్లలో యార్కర్లు, స్లో బాల్స్‌తో పరుగులను నియంత్రించడంలో బుమ్రా దిట్ట. ఆ తరహా బౌలింగ్‌ను వేయడంలో మిగిలిన బౌలర్లు పూర్తిగా తేలిపోతున్నారు. ఒకప్పుడు టీ20ల్లో నెంబర్ వన్ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అర్షదీప్ సింగ్ సైతం ఘోరంగా విఫలమవుతున్నాడు.

ఐపీఎల్‌లో అదరగొట్టిన కొంతమంది యువ పేసర్లు కూడా విదేశీ పిచ్‌లపై చేతులెత్తేస్తున్నారు. తాజాగా లార్డ్స్ వన్డేలో బుమ్రా లేకపోవడంతో భారత బౌలింగ్ విభాగంలో అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. యువ బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఒక ఆటగాడిపైనే ఎక్కువగా ఆధారపడటం జట్టుకు మంచిది కాదనే ఉద్దేశంతో, బీసీసీఐ , మేనేజ్‌మెంట్ బుమ్రాకు తరచూ విశ్రాంతిని ఇస్తూ మిగతా బౌలర్లను ఆడిస్తోంది.
కానీ అదే సమయంలో బుమ్రాకు(Jasprit Bumrah) సరైన రీప్లేస్మెంట్‌ను వెతకడంలో మాత్రం విఫలమవుతోంది. ఇది భవిష్యత్తులో టీమిండియాకు అతిపెద్ద బలహీనతగా మారే ప్రమాదముందని కొంతమంది మాజీలు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా బుమ్రాకు(Jasprit Bumrah) రీప్లేస్ మెంట్‌గా రిజర్వ్ బెంచ్‌ను సిద్ధం చేసే విషయంలో బీసీసీఐ మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం కచ్చితంగా కనిపిస్తోంది.
Trainee IPS : పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అరాచకం..లేడీ ఐపీఎస్ ఆఫీసర్‌కు వేధింపులు





