Kolkata Knight Riders : సన్ రైజర్స్ కు షాక్..కోల్ కతా చేతిలో చిత్తు
Kolkata Knight Riders : ఐపీఎల్ 19వ సీజన్ లో సన్ రైజర్స్ జోరుకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు విజయాలతో దుమ్మురేపిన సన్ రైజర్స్ హైదారాబాద్ కు కోల్ కతా నైట్ రైడర్స్ షాకిచ్చింది
Kolkata Knight Riders
ఐపీఎల్ 19వ సీజన్ లో సన్ రైజర్స్ జోరుకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు విజయాలతో దుమ్మురేపిన సన్ రైజర్స్ హైదారాబాద్ కు కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) షాకిచ్చింది. అది కూడా ఎస్ఆర్ హెచ్ హోంగ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో కేకేఆర్ చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ ఆల్ రౌండ్ షో కనబరిచిన కోల్ కతా సీజన్ లో మూడో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ కమ్మిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎప్పటిలానే ఓపెనర్లు హెడ్ , అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు కేవలం 3.4 ఓవర్లలోనే 44 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ (15) ఔటైనా హెడ్, ఇషాన్ కిషన్ దూకుడు కొనసాగించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఈ క్రమంలో హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హెడ్ 28 బంతుల్లో 61 ( 9 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటవగా అప్పటికి సన్ రైజర్స్ స్కోరు 105/2 (9 ఓవర్లు)గా ఉంది. దీంతో 200 ప్లస్ స్కోరు ఖాయమని అంతా అనుకున్నారు. అయితే కేకేఆర్ బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వరుస వికెట్లు తీసి సన్ రైజర్స్ ను దెబ్బకొట్టారు.
ఫలితంగా క్లాసెన్ (11), స్మరన్ రవిచంద్రన్ (4), అనికేత్ వర్మ(6) నిరాశపరిచారు. సన్ రైజర్స్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. నరైన్ 2 , వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసారు. మొదటి 9 ఓవర్లలో 105 రన్స్ చేసిన హైదరాబాద్ తర్వాత 60 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.

అటు ఛేజింగ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రహానే, ఫిన్ అలెన్ తొలి వికెట్ కు 4 ఓవర్లలోనే 49 పరుగులు జోడించారు. అలెన్ (29) ఔటైన తర్వాత రహానే, రఘువంశీ కోల్ కతా ఇన్నింగ్స్ నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 84 పరుగులు జోడించడంతో కేకేఆర్ విజయం ఖాయమైంది.
రహానే(42) ఔటైనా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రఘువంశీ దూకుడుగా ఆడాడు. చివర్లో రఘువంశీ(59) వెనుదిరిగినా గ్రీన్, రింకూ కోల్ కతాను గెలిపించారు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. కాగా ఈ సీజన్ లో కేకేఆర్ కు ఇది మూడో విజయం.
Mamata Banerjee : దీదీకి నిద్రలేని రాత్రులు..కౌంటింగ్ పై శ్రేణులకు కీలక ఆదేశాలు





