LSG vs PBKS : గెలిస్తేనే నిలిచేది..లక్నోతో పంజాబ్ చావోరేవో

LSG vs PBKS : లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. గత సీజన్ తరహాలోనే ఈసారి కూడా లక్నో నిరాశ పరిచింది

LSG vs PBKS

ఐపీఎల్ 19వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ డూ ఆర్ డై మ్యాచ్ కు సిద్ధమైంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్(LSG vs PBKS) తో తలపడబోతోంది. లక్నో హోంగ్రౌండ్ లో జరగబోతున్న ఈ మ్యాచ్ పంజాబ్ కు కీలకం. ఎందుకంటే వరుసగా ఆరు మ్యాచ్ లు ఓడి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. నిజానికి సీజన్ ఆరంభంలో పంజాబ్ ఆటతీరు చూసిన తర్వాత టైటిల్ ఫేవరెట్స్ లో ముందుంటుందని అంతా అనుకున్నారు.

దానికి తగట్టే వరుసగా ఆరు మ్యాచ్ లు గెలిచింది. అయితే సెకండాఫ్ లో మాత్రం చేతులెత్తేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు మ్యాచ్ లలో ఓడి రేసులో వెనుకబడింది. ఇప్పుడు లక్నోపై గెలిస్తే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. అదే సమయంలో రాజస్థాన్, కోల్ కతా జట్లు తమ చివరి మ్యాచ్ లలో ఓడిపోవాల్సి ఉంటుంది. పంజాబ్ బలమంతా బ్యాటింగే.

గత మ్యాచ్ లో టాపార్డర్ వైఫల్యంతో భారీ టార్గెట్ ను ఛేదించలేకపోయింది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ , కూపర్ కన్నోలీ రాణిస్తే తిరుగుండదు. చివర్లో స్టోయినిస్, శశాంక్ సింగ్ మెరుపులు మెరిపిస్తున్నారు. బౌలింగ్ పరంగా అర్షదీప్ సింగ్, బార్ట్ లెట్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అర్షదీప్ సింగ్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. బార్ట్ లెట్ భారీగా పరుగులిచ్చేస్తున్నాడు. ఒమర్జాయ్, ఫెర్గ్యూసన్ లపై అంచనాలున్నాయి. చాహల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అవకాశముంది.

LSG vs PBKS

మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించింది. గత సీజన్ తరహాలోనే ఈసారి కూడా లక్నో నిరాశ పరిచింది. అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్స్ విఫలమయ్యారు. కెప్టెన్ పంత్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. సారథిగానూ, బ్యాటర్ గానూ పూర్తిగా ఫెయిలయ్యాడు. నికోలస్ పూరన్ వైఫల్యం కూడా లక్నో ఓటములకు కారణంగా చెప్పొచ్చు.

ఈ సీజన్ ను చివరి స్థానంలో ముగించకుండా ఉండాలంటే పంజాబ్ పై గెలవాలి. చెన్నైని ఓడించిన తర్వాత రాజస్థాన్ చేతిలో పరాజయం పాలైన లక్నోకు నిలకడలేమి బ్యాటింగ్ ఇబ్బందిగా మారింది. బౌలింగ్ లో మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ కీలకంగా ఉన్నారు. స్పిన్నర్ షాాబాజ్ అహ్మద్ రాణిస్తుండడం లక్నోకు కలిసొచ్చే అంశం. ఇక గత రికార్డులను చూస్తే పంజాబ్ కింగ్స్ దే పైచేయిగా ఉంది.

America – Iran : అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు..కొద్ది గంటల్లో కీలక ప్రకటన ?

Exit mobile version