Just SportsLatest News

MI vs GT : ముంబై గెలుపు బాట పట్టేనా ?..గుజరాత్ తో కీలక పోరు

MI vs GT : ఐపీఎల్ 19వ సీజన్ లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్ కు సిద్ధమైంది

MI vs GT

ఐపీఎల్ 19వ సీజన్ లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్(MI vs GT) తో తలపడబోతోంది. ముంబై ఈసారి కూడా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. ఆరంభ మ్యాచ్ లో గెలిచిన ఆ జట్టు తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోయింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేవలం 2 పాయింట్లతో అట్టడుగు స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్ అవకాశాలు నిలవాలంటే ఇప్పటి నుంచి జరిగే మ్యాచ్ లలో విజయాలు సాధించాల్సిందే. రోహిత్ శర్మ గాయంతో దూరమవడం ముంబైకి ఎదురుదెబ్బగా చెప్పాలి. గత మ్యాచ్ లో డికాక్ సెంచరీ చేసినా బౌలర్ల వైఫల్యంతో ఓటమి పాలైంది.

బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్, రికల్టన్ పేలవ ఫామ్ లో ఉన్నారు. తిలక్ వర్మ సైతం నిరాశపరుస్తున్నాడు. హార్థిక్ పాండ్యా, రూథర్ ఫర్డ్ మ్యాచ్ లను ఫినిష్ చేయలేకపోతున్నారు. బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తేనే ముంబై గెలుపు బాట పట్టే రికెల్టన్ అవకాశముంటుంది. అటు బౌలింగ్ లోనూ ముంబైకి ఏదీ కలిసి రావడం లేదు. స్టార్ పేసర్ బుమ్రా వికెట్లు తీయలేకపోతుండడం ఆ జట్టుకు మైనస్ పాయింట్.

ఒకప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన బుమ్రా ఇప్పుడు ఐదు మ్యాచ్ లలో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. దీంతో ముంబై త్వరగా ఫామ్ అందుకోవాలని ముంబై ఎదురుచూస్తోంది. మిగిలిన బౌలర్లలో శార్థూల్ ఠాకూర్ , హార్థిక్ పాండ్య , శాంట్నర్ కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు.

MI vs GT
MI vs GT

మరోవైపు గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో అదరగొడుతోంది. మొదట వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన గుజరాత్ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఢిల్లీ, లక్నో, కోల్ కతా జట్లపై గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. శుభమన్ గిల్ , సాయి సుదర్శన్ తో పాటు బట్లర్ ఫామ్ లో ఉండగా… వాషింగ్టన్ సుందర్ కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు.

అటు బౌలింగ్ లో రబాడ, సిరాజ్ , ప్రసిద్ధ కృష్ణ సత్తా చాటుతున్నారు. స్పిన్నర్ రషీద్ ఖాన్ కూడా కీలకంగా ఉన్నాడు. ఏ విధంగా చూసినా ఈ మ్యాచ్ లో గుజరాత్ నే ఫేవరెట్ గా చెబుతున్నారు. గత రికార్డుల్లో ముంబైపై గుజరాత్(MI vs GT) దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 8 సార్లు తలపడితే గుజరాత్ ఐదింటిలో గెలిచింది. మూడు మ్యాచ్ లలో ముంబై విజయం సాధించింది.

Punjab Kings : దంచికొట్టిన పంజాబ్ కింగ్స్..చిత్తుగా ఓడిన లక్నో

Related Articles

Back to top button