Just SportsLatest News

PBKS vs KKR : పంజాబ్ కు ఎదురుందా ?…కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్

PBKS vs KKR : ఐపీఎల్ 19వ సీజన్ లో వరుస విజయాలతో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసింది. సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడబోతోంది

PBKS vs KKR

ఐపీఎల్ 19వ సీజన్ లో వరుస విజయాలతో అదరగొడుతున్న పంజాబ్ కింగ్స్ హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసింది. సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్(PBKS vs KKR) తో తలపడబోతోంది. ఆడిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచిన పంజాబ్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.

తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పైనా, రెండో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 210 టార్గెట్ ను ఛేజ్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోలీ , శశాంక్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ చెలరేగి ఆడుతున్నారు. స్టోయినిస్ లాంటి ఆల్ రౌండర్ కూడా పంజాబ్ కు అడ్వాంటేజ్.

బౌలింగ్ లో సైతం పంజాబ్(PBKS vs KKR) అదరగొడుతోంది. మార్కో జాన్సెన్, బార్ట్ లెట్, విజయ్ కుమార్ వైశాఖ్ తో పాటు స్పిన్నర్ చాహల్ కూడా నిలకడగా రాణిస్తున్నారు. కీలక సమయంలో అదరగొడుతూ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. బౌలర్ల ప్రదర్శన కారణంగానే చెన్నైని గత మ్యాచ్ లో మరింత భారీస్కోరు చేయకుండా అడ్డుకోగలిగారు.

మరోవైపు ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన కోల్ కతా నైట్ రైడర్స్ పూర్తి ఒత్తిడిలో ఉంది. రహానే కెప్టెన్సీలో గత సీజన్ లో నిరాశపరిచిన కేకేఆర్ ఈసారి కూడా పేలవ ప్రదర్శనతో సతమతమవుతోంది. అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లెవ్వరూ రాణించడం లేదు. ముంబై ఇండియన్స్ పై భారీస్కోరు చేసినా ఓడిపోయింది.

PBKS vs KKR
PBKS vs KKR

తర్వాత సన్ రైజర్స్ పై భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో చేతులెత్తేసింది. రఘువంశీ, రింకూ సింగ్ తప్పిస్తే మిగిలినవారంతా ఫ్లాప్ అవుతున్నారు. బ్యాటర్లు గాడిన పడితే తప్ప కోల్ కతా తొలి విజయాన్ని రుచిచూడడం కష్టమే. అటు బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మ్యాజిక్ చూపించలేకపోతున్నాడు.

పేస్ విభాగంలో ముజర్బానీ, వైభవ్ అరోరా రాణిస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ కే మొగ్గుచూపుతుంది. గత రికార్డుల్లో పంజాబ్ కింగ్స్ పై కోల్ కతాదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 35 సార్లు తలపడితే కేకేఆర్ 21 మ్యాచ్ లలో విజయం సాధించింది. పంజాబ్ 13 మ్యాచ్ లలో గెలిచింది.

RCB :రఫ్ఫాడించిన ఆర్సీబీ…చెన్నైకి మూడో ఓటమి

Related Articles

Back to top button