Punjab Kings : టేబుల్ టాపర్ నుంచి ఎలిమినేట్..పంజాబ్ కు ఇదేం ఖర్మ
Punjab Kings : 15 పాయింట్లతో ఉన్న పంజాబ్ ను రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో వెనక్కి నెట్టి చివరి ప్లే ఆఫ్ బెర్త్ సొంతం చేసుకుంది.
Punjab Kings
క్రికెట్ లో. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మరీ ముఖ్యంగా ఐపీఎల్ లాంటి లీగ్స్ లో ఊహించని ఫలితాలు కనిపిస్తుంటాయి. ఆరంభంలో నిరాశ పరిచిన టీమ్స్ టైటిల్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొదట్లో అదరగొట్టిన జట్లు తర్వాత చతికిలపడొచ్చు. ప్రస్తుతం ఐపీఎల్ 19వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ది ఇదే పరిస్థితి.
సీజన్ ప్రారంభంలో వరుస విజయాలతో దుమ్మురేపిన పంజాబ్(Punjab Kings) టైటిల్ ఫేవరేట్ జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచింది. టేబుల్ టాపర్ గా నిలిచిన ఆ జట్టు ఈసారి టైటిల్ కల నెరవేర్చుకునేలా కనిపించింది. ఎంతటి భారీ టార్గెట్ అయినా అలవోకగా ఛేదించింది. ఈ క్రమంలో డబుల్ హ్యాట్రిక్ విజయాలు కూడా అందుకుంది.
కానీ సెకండాఫ్ లో చేతులెత్తేసింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు మ్యాచ్ లు ఓడిపోయింది. చివరి మ్యాచ్ గెలిచినా ఫలితం లేకపోయింది. 15 పాయింట్లతో ఉన్న పంజాబ్ ను రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లతో వెనక్కి నెట్టి చివరి ప్లే ఆఫ్ బెర్త్ సొంతం చేసుకుంది.
సీజన్ ఫస్టాఫ్ లో అదరగొట్టిన పంజాబ్ సెకండాఫ్ లో అనవసర ఒత్తిడికి లోనైంది. తద్వారా వరుస పరాజయాలతో చేజేతులా ప్లేఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది.పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్ చేరకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రధాన కారణం బౌలింగ్ బలహీనంగా ఉండడమే.

మొదట్లో భారీ టార్గెట్స్ ఉన్నా బ్యాటింగ్ బలంతో వరుస విజయాలు సాధించిన పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినప్పుడు మాత్రం తేలిపోయింది.అప్పుడే బౌలింగ్‌లో లోపాలు బయటపడ్డాయి. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు బౌలింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయింది. దీనికి తోడు చెత్త ఫీల్డింగ్ కూడా పంజాబ్ కొంపముంచింది.
శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్(Punjab Kings) ఆటగాళ్లు కూడా ఏకంగా 20 క్యాచ్‌లను వదిలేసి తమ ఓటములకు తామే కారణమయ్యారు. మొత్తం మీద 19 సీజన్లుగా కప్పు కోసం నిరీక్షిస్తున్న పంజాబ్‌కు ఈ ఏడాది కూడా నిరాశనే మిగిల్చింది.
Relatives: బంధువులలో పెరుగుతున్న నిశ్శబ్ద విషం..చుట్టాల ఎదుగుదలను ఎందుకు ఓర్వలేకపోతున్నారు?





