Just SportsLatest News

Punjab Kings : టాప్ లోనే పంజాబ్.. అట్టడుగున లక్నో..ఐపీఎల్ లో ఇకపైనే అసలు మజా

Punjab Kings : ఐపీఎల్ 19వ సీజన్ సగానికి పైగా మ్యాచ్ లు అయిపోయాయి. ప్రతీ జట్టు 8కి తక్కువ కాకుండా మ్యాచ్ లు ఆడేశాయి

Punjab Kings

ఐపీఎల్ 19వ సీజన్ సగానికి పైగా మ్యాచ్ లు అయిపోయాయి. ప్రతీ జట్టు 8కి తక్కువ కాకుండా మ్యాచ్ లు ఆడేశాయి. కొన్ని జట్లు ఊహించినట్టుగానే అదరగొడుతుంటే మరికొన్ని పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ గా పేరున్న ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో కింది స్థానాల్లో పడుతూ లేస్తూ సాగుతున్నాయి.

ఐదు వారాలు ముగిసిన ఐపీఎల్ 19వ సీజన్ లో ప్రస్తుతం టాప్ 4 రేస్ ఆసక్తికరంగా మారింది. నిలకడగా రాణిస్తున్న రెండు మూడు జట్లు టాప్ 4 లోనే స్థిరంగా ఉంటే.,.. సెకండాఫ్ లో కొన్ని జట్లు బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. ఫలితంగా టాప్ 4లో ప్లేస్ కోసం గట్టిపోటీ ఉండబోతోంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికను చూస్తే 42 మ్యాచ్ లు ముగిసిన తర్వాత పంజాబ్ కింగ్స్(Punjab Kings) అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఛాంపియన్ తరహాలో ఆడుతున్న పంజాబ్(Punjab Kings) కు గత మ్యాచ్ లో తొలి ఓటమి ఎదురైనా తమ టాప్ ప్లేస్ నిలుపుకుంది. ఇప్పటి వరకూ 8 మ్యాచ్ లు ఆడి ఆరింటిలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఓడిపోగా, మరొకటి వర్షం కారణంగా రద్దయ్యి ప్రస్తుతం 13 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. గత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ఓడినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో కొనసాగుతోంది. 9 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ ఆరు గెలిచి, మూడింటిలో పరాజయం పాలైంది.

ఇదిలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో ప్లేస్ లో ఉంది. ఇప్పటి వరకూ 9 మ్యాచ్ లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ ఆరు గెలిచి, మూడు ఓడిపోయింది. అద్భుతమైన ఆటతీరుతో భారీ టార్గెట్లను ఛేజ్ చేస్తూ టాప్ 4 రేసులో దూసుకెళుతోంది. అటు టాప్ ప్లేస్ లో ఉన్న పంజాబ్ కింగ్స్(Punjab Kings) కు షాకిచ్చిన రాజస్థాన్ రాయల్స్ నాలుగో ప్లేస్ లో ఉంది.

Punjab Kings
Punjab Kings

ఇప్పటి వరకూ 9 మ్యాచ్ లలో ఆరు గెలిచి, మూడు ఓడిపోయింది. గత వారం రోజులుగా ఈ టాప్4 లో పెద్దగా మార్పులు జరగలేదు. కానీ టాప్ 5 నుంచి కింది వరకూ మాత్రం సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 5 విజయాలు, 4 ఓటములతో 10 పాయింట్లు సాధించింది. అలాగే ఆరంభంలో తడబడి తర్వాత మెల్లగా పుంజుకుంటున్న చెన్నై సూపర్ కింగ్స్ మూడే విజయాలు సాధించినా ఆరో ప్లేస్ లో కొనసాగుతోంది.

ఇక ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ తర్వాత వరుస ఓటములతో డీలా పడింది. ప్రస్తుతం ఢిల్లీ 8 మ్యాచ్ లలో 3 విజయాలు, ఐదు పరాజయాలతో ఏడో ప్లేస్ లో కొనసాగుతోంది. అటు కోల్ కతా నైట్ రైడర్స్ 8 మ్యాచ్ లలో కేవలం రెండు విజయాలే అందుకుని 8వ స్థానంలో ఉంది. ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలతో 9వ స్థానంలో ఉండగా… పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోన్న లక్నో సూపర్ జెయింట్స్ 10వ ప్లేస్ లో ఉంది.

Rishabh Pant : చేజేతులా నాశనం..పంత్ కు ఇక వన్డేల్లో చోటు లేనట్టే

Related Articles

Back to top button