PV Sindhu : జపాన్ గడ్డపై సింధు జైత్రయాత్ర..ఫైనల్లో యమగుచికి చుక్కలు చూపించిన గోల్డెన్ గర్ల్
PV Sindhu : వరల్డ్ నంబర్ వన్ రేసులో ఉన్న యమగుచికి తన పదునైన స్మాష్‌లు, ఊహించని రిటర్న్‌లతో ఏమాత్రం కోలుకునే ఛాన్స్ ఇవ్వలేదు సింధు.
PV Sindhu
భారత స్టార్ షట్లర్, పతకాల ముద్దుబిడ్డ పీవీ సింధు(PV Sindhu) మరోసారి తన సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అద్భుతమైన ఆటతీరుతో టైటిల్ సాధించి, తన కెరీర్‌లో ఈ ఘనతను ఫస్ట్ టైమ్ సొంతం చేసుకుంది. తన ఆడియన్స్ మధ్య ఆడుతున్న జపాన్ స్టార్ అకానే యమగుచిపై.. ఇండియన్ స్టార్ సింధు చూపిన ఆధిపత్యం ఇప్పుడు స్పోర్ట్స్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది.
ఫైనల్ మ్యాచ్‌ను సింధు(PV Sindhu)ప్రారంభం నుంచే ఆటను పట్టుకోలేదు, శాసించిందనే చెప్పాలి. వరల్డ్ నంబర్ వన్ రేసులో ఉన్న యమగుచికి తన పదునైన స్మాష్‌లు, ఊహించని రిటర్న్‌లతో ఏమాత్రం కోలుకునే ఛాన్స్ ఇవ్వలేదు. సుదీర్ఘ గేమ్‌లో సింధు చూపించిన సహనం, నెట్ వద్ద ఆమె ప్రదర్శించిన స్కిల్ మ్యాచ్‌ను పూర్తిగా భారత షట్లర్ వైపు తిప్పేశాయి.
రెండు గేమ్‌లలోనూ ప్రత్యర్థిని 21-17, 21-17 స్కోరుతో చిత్తు చేసేసి, వరుస గేమ్‌లలో విజయాన్ని సాధించడం ఆమె ఫిట్‌నెస్‌కు నిదర్శనంగా చెప్పొచ్చు. సరిగ్గా 50 నిమిషాల వ్యవధిలోనే సింధు మ్యాచ్‌ను కంప్లీట్ చేసేసి పసిడి పతకాన్ని ముద్దాడింది.
కొద్ది కాలంగా ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్న సింధుకు, ఈ జపాన్ ఓపెన్ విక్టరీ ఒక పెద్ద బూస్టప్ అని చెప్పాలి. మెయిన్‌గా ఒలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లలో బాగా రాణించిన ఆమె.. ఇలాంటి సూపర్ 750 స్థాయి టోర్నమెంట్లలో మెరవడం పీవీ సింధు కెరీర్ గ్రాఫ్‌ను మళ్లీ పైకి తీసుకెళ్తుంది. తన అద్భుతమైన ఫుట్‌వర్క్‌తో పాటు డయాగనల్ స్మాష్‌లతో యమగుచిని డిఫెన్స్‌లో పడేయడం ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది.

ఒక్క జపాన్ ఓపెన్ మాత్రమే కాకుండా, ఈ ఏడాది మిగతా టోర్నీలకు కూడా పీవీ సింధు ఈ విజయంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుకున్నట్లు అయింది. ఈ విక్టరీతో రాబోయే మరిన్ని అంతర్జాతీయ టోర్నమెంట్లలో కూడా మరింత దూకుడుగా ఆడటం ఖాయమని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.
ఎన్నో ఏళ్ల కృషి, నిత్య సాధనతో సింధు తనను తాను మళ్లీ ప్రూవ్ చేసుకోవడమే కాకుండా, భారత బ్యాడ్మింటన్ ఖ్యాతిని మరోసారి విశ్వ వేదికపై సగర్వంగా మరోసారి నిలబెట్టింది. సింధు విజయంతో అభిమానులు సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తూ.. సంబరాలు చేసుకుంటున్నారు.
Iran Attack : పెంటగాన్ రివెంజ్ అటాక్స్..ఇద్దరు అమెరికా సైనికుల మృతితో గల్ఫ్ రీజియన్‌లో హై అలర్ట్ ..





