Just InternationalJust PoliticalLatest News

Iran Attack : పెంటగాన్ రివెంజ్ అటాక్స్‌..ఇద్దరు అమెరికా సైనికుల మృతితో గల్ఫ్ రీజియన్‌లో హై అలర్ట్ ..

Iran Attack : ఈ ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే.. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని సాధించకుండా అడ్డుకుంటామని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Iran Attack

మిడిల్ ఈస్ట్ మరోసారి యుద్ధ జ్వాలలతో రగిలిపోతుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత నెలలో కుదిరిన శాంతి ఒప్పందం మొత్తం ఫెయిల్ అవ్వడంతో.. రెండు దేశాల మధ్య సైనిక ఘర్షణలు పీక్‌ స్టేజ్‌కు చేరాయి. జోర్డాన్‌లోని యూఎస్ మిలిటరీ బేస్‌పై ఇరాన్(Iran Attack) చేసిన డ్రోన్, బాలిస్టిక్ క్షిపణుల అటాక్‌లో ఇద్దరు అమెరికా సైనికులు స్పాట్‌లోనే చనిపోయారు.

మరో నలుగురు సైనికులు తీవ్రంగా గాయపడగా, ఇంకొక సైనికుడు గల్లంతయ్యాడు. ఈ ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూనే.. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని సాధించకుండా అడ్డుకుంటామని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

సైనికుల మృతిపై అమెరికా డిఫెన్స్ విభాగం పెంటగాన్ చాలా వేగంగా, అంతే క్రూరంగా రియాక్ట్ అయింది. ఇరాన్ సైన్యానికి చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్థావరాలే టార్గెట్‌గా యూఎస్ ఎయిర్ ఫోర్స్ భీకరమైన వైమానిక దాడులను మొదలుపెట్టింది. దీనికి కౌంటర్‌గా ఇరాన్ కూడా గల్ఫ్ రీజియన్‌లోని అమెరికా బేస్‌లపై డ్రోన్లు, మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది.

పరిస్థితి చేయి దాటిపోతుండటంతో వైట్ హౌస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికన్ సిటిజన్స్‌కు అర్జెంట్ ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. పశ్చిమాసియాలో ఏ క్షణంలో అయినా విమాన సర్వీసులు క్యాన్సిల్ అయి ఎయిర్‌స్పేస్‌లు క్లోజ్ అయ్యే అవకాశం ఉందని, కాబట్టి అమెరికన్లు చాలా అలర్ట్‌గా ఉంటూ లోకల్ ఎంబసీల సూచనలు పాటించాలని స్పష్టం చేసింది.

మరోవైపు ఇరాన్ సపోర్ట్ ఉన్న మిలిటెంట్ గ్రూపులు ప్రపంచంలో ఎక్కడైనా సరే అమెరికన్లను టార్గెట్ చేయొచ్చనే అనుమానంతో సెక్యూరిటీని మరింత ఎక్కువ చేశారు. అలాగే ఈ యుద్ధాన్ని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తూ.. అమెరికా నావికాదళం ఇరాన్‌పై కఠినమైన సముద్ర దిగ్బంధాన్ని కూడా విధించింది.

Iran Attack
Iran Attack

అరేబియా సముద్రంలో యూఎస్ఎస్ డోనాల్డ్ కుక్ యుద్ధనౌకతో పాటు సీ హాక్ హెలికాప్టర్లతో పెట్రోలింగ్ చేస్తూ ఇప్పటివరకు ఇరాన్ వైపు వెళ్తున్న 5 కమర్షియల్ షిప్స్‌ను కూడా అడ్డుకుని దారి మళ్లించారు.

అంతేకాదు, అమెరికా హెచ్చరికలను తేలికగా తీసుకుని ముందుకెళ్లిన ఒక భారీ ఆయిల్ ట్యాంకర్‌ను యూఎస్ మిలిటరీ క్షిపణి దాడి చేసి సముద్రం నడిబొడ్డునే నిలిపివేసింది. కాగా3 ఈ పరస్పర దాడుల తీవ్రత చూస్తుంటే పశ్చిమాసియా ప్రాంతంలో టెన్షన్ మరింత పెరిగేలాగే కనిపిస్తోంది.

Date Of Birth : ఈ నెంబర్ వారు ఈగో తగ్గించుకోకపోతే నష్టమే.. ఈ నెంబర్ వారికి ఆర్థికంగా గ్రోత్ కనిపిస్తోంది..

Related Articles

Back to top button