SRH vs RR : సన్ రైజర్స్ జోరు కొనసాగేనా ?..రాజస్థాన్ తో కీలక మ్యాచ్
SRH vs RR : ఐపీఎల్ 19వ సీజన్ లో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు బయటి మ్యాచ్ ల సవాల్ కు రెడీ అయింది
SRH vs RR
ఐపీఎల్ 19వ సీజన్ లో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్(SRH vs RR) ఇప్పుడు బయటి మ్యాచ్ ల సవాల్ కు రెడీ అయింది. సొంతగడ్డపై వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన ఆరెంజ్ ఆర్మీకి ఇప్పుడు అసలు పరీక్ష మొదలవుతుంది. జైపూర్ వేదికగా శనివారం రాత్రి రాజస్థాన్ రాయల్స్(SRH vs RR) తో తలపడబోతోంది. హోంగ్రౌండ్ లో వరుసగా సాధించిన విజయాలతో సన్ రైజర్స్ పాయింట్ పట్టికలో దూసుకొచ్చింది.
ప్రస్తుతం 7 మ్యాచ్ లలో 4 విజయాలతో 8 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ , క్లాసెన్ అదరగొడుతున్నారు. ఆరంభ మ్యాచ్ లలో నిరాశపరిచిన అభిషేక్ శర్మ ఢిల్లీపై మాత్రం సెంచరీతో చెలరేగిపోయాడు. అలాగే క్లాసెన్ అత్యంత నిలకడగా రాణిస్తున్నాడు. ఫలితంగా సన్ రైజర్స్ భారీస్కోర్లు చేస్తోంది.
అయితే బయటి వేదికల్లో సన్ రైజర్స్ బ్యాటర్లు ఎలా రాణిస్తారనేది చూడాలి. ఈ మ్యాచ్ కు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. గాయం నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధించిన కమిన్స్ రాజస్థాన్ పై బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. దీంతో ఇషాన్ కిషన్ కీపర్ గానే కొనసాగుతాడు. బౌలింగ్ లో కూడా సన్ రైజర్స్ దుమ్మురేపుతోంది. హర్షల్ పటేల్ , ఉనాద్కట్ పెద్దగా రాణించకున్నా యువ పేసర్లు సకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే అదరగొడుతున్నారు.
ఎషాన్ మలింగా మలింగా సైతం సత్తా చాటుతున్నాడు. అయితే కమిన్స్ రాకతో ప్రఫుల్ పై వేటు అవకాశాలున్నాయి. స్పిన్నర్ శివాంగ్ కుమార్ కూడా కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా మళ్లీ గెలుపు బాట పట్టింది. ఆరంభంలో వరుసగా నాలుగు విజయాలతో అదరగొట్టిన రాజస్థాన్ తర్వాత వరుసగా రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ పై తక్కువ స్కోరు చేసినా కూడా అద్భుతమైన బౌలింగ్ తో కాపాడుకుంది.

కాగా సన్ రైజర్స్(SRH vs RR) చేతిలో కూడా ఓటమి రుచి చూసిన రాజస్థాన్ ఇప్పుడు తమ హోంగ్రౌండ్ లో ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. బ్యాటింగ్ లో జైస్వాల్ , వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ కు ప్రధాన బలం. వీరిచ్చే శుభారంభాలతోనే పలు విజయాలను అందుకుంది. గత రెండు మ్యాచ్ లలో వీరిద్దరూ నిరాశపరచడం కాస్త ఇబ్బందిగా మారింది.
ఇప్పుడు హోంగ్రౌండ్ లో మళ్లీ వీరిద్దరూ ఫామ్ అందుకోవాలని ఎదురుచూస్తున్నారు. కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాటింగ్ లో నిరాశపరుస్తున్నాడు. హెట్ మెయిర్ కూడా ఆడింది లేదు. ఫెరీరా, జడేజా మాత్రం గత మ్యాచ్ లో రాణించారు. అటు బౌలింగ్ లో ఆర్చర్ , బర్గర్, సందీప్ శర్మ పేస్ విభాగంలో కీలకంగా ఉన్నారు. స్పిన్నర్లుగా జడేజా, రవి బిష్ణోయ్ సత్తా చాటుతున్నారు. కాగా మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న జైపూర్ పిచ్ బాలెన్సింగ్ గా ఉంటుందని అంచనా.
Lord Venkanna:రూ. 300 టికెట్లు దొరకలేదా? శ్రీవారి దర్శనానికి మరో ఈజీ మార్గం..





