Sri Lanka Cricket : ఐపీఎల్ ఆడకుండా అడ్డుకున్నారు…సొంత బోర్డుపై లంక ప్లేయర్ కేసు
Sri Lanka Cricket : ఐపీఎల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దీనిలో ఆడేందుకు విదేశీ క్రికెటర్లు ఉవ్విళ్లూరుతుంటారు.
Sri Lanka Cricket
ఐపీఎల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దీనిలో ఆడేందుకు విదేశీ క్రికెటర్లు ఉవ్విళ్లూరుతుంటారు. ఎంత పెద్ద స్టార్ ప్లేయర్ అయినా కూడా ఈ రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్ లో భాగం కావాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ డబ్బుకు డబ్బు.. పేరుకు పేరు… లగ్జరీ లైఫ్.. లీగ్ జరిగిన రెండు నెలలు ఆటగాళ్లందరికీ ఐపీఎల్ ఒక మంచి వెకేషన్.
అయితే ఐపీఎల్ లో ఆడేందుకు ప్రతీ ఆటగాడు తమ సొంత క్రికెట్ బోర్డు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సిందే. ఎన్ వోసీ లేకుంటే మాత్రం లీగ్ లో ఆడలేరు. కానీ గాయాల నుంచి కోలుకున్న ప్లేయర్స్ కు , ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బందిపడే ఆటగాళ్లకు పలు దేశాల బోర్డులు అనుమతి ఇవ్వవు.
వారు ఫిట్ గా ఉంటేనే గ్రీన్ సిగ్నల్ లేకుంటే జాతీయ జట్టుకే మొదటి ప్రాధాన్యత కాబట్టి ఐపీఎల్ కు అనుమతించరు. ప్రస్తుతం లంక క్రికెట్ బోర్డు(Sri Lanka Cricket) ఇదే అనుసరిస్తుండగా.. ఒక క్రికెటర్ కోర్టు మెట్లు ఎక్కాడు.
తాను ఫిట్ గా ఉన్నా కూడా ఎన్ వోసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ శ్రీలంక క్రికెట్(Sri Lanka Cricket) బోర్డుపై ఆ దేశానికి చెందిన నువాన్ తుషార కేసు వేశాడు. ఐపీఎల్ 2026 సీజన్ లో తుషారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడాల్సి ఉంది. అయితే పూర్తి ఫిట్ నెస్ సాధించలేదంటూ లంక బోర్డు ఎన్ వోసీ జారీ చేయలేదు.
దీంతో ఐపీఎల్ ఆడేందుకు తుషార వెళ్లలేకపోయాడు. ఇప్పుడు తుషార తన ఎన్ వోసీ కోసం కోర్టును ఆశ్రయించాడు. ఐపీఎల్ ఆడేందుకు తనకు అనుమతివ్వాలని పిటిషన్ దాఖలు చేశాడు. కొలంబో జిల్లా కోర్టు దీనిని విచారణకు తీసుకుంది. తన సెంట్రల్ కాంట్రాక్ట్ ను పునరుద్ధరించొద్దని కూడా బోర్డుకు చెప్పిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చాడు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు కూడా వెల్లడించాడు. తుషార తన ఫిర్యాదులో శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మీ సిల్వా, కార్యదర్శి బందుల దిస్సనాయకే, కోశాధికారి సుజీవ గొడలియడ్డ, సీఈఓ ఆష్లే డిసిల్వాలను ప్రతివాదులుగా చేర్చాడు.
ఏప్రిల్ 9వ తేదీన ఈ కేసు విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. కొలంబో జిల్లా కోర్టు దీనిని ఇవాళ దర్యాప్తుకు స్వీకరించగా.. క్రికెట్ బోర్డుతో తన ఒప్పందం మార్చి 31వ తేదీతో ముగియాల్సి ఉందని, ఆ ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించొద్దని, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను తప్పుకోవాలనుకుంటున్నానని ఇప్పటికే ఈ విషయాన్ని బోర్డుకు తెలియజేసినట్లు తుషారా వెల్లడించాడు.





