Just SportsLatest News

Vaibhav Sooryavanshi : బుడ్డోడా మజాకా..ఏ జట్ల ట్రై సిరీస్ లైవ్

Vaibhav Sooryavanshi : భారత్ ఏ , శ్రీలంక ఏ, ఆప్ఘనిస్థాన్ ఏ జట్ల మధ్య జరగనున్న ట్రై సిరీస్ కు ఇప్పుడు క్రేజ్ వచ్చేసింది. ఆ క్రేజ్ కు కారణం వైభవ్ సూర్యవంశీ.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో వైభవ్ పరుగుల విధ్వంసం సృష్టించాడు

Vaibhav Sooryavanshi

సాధారణంగా పెద్ల జట్ల మధ్య జరిగే సిరీస్ లపైనే క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి జట్లతో ఆడే సిరీస్ లకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు. ఇదే కారణంగా స్పాన్సర్లు, బ్రాడ్ కాస్టర్లు కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఇక ద్వితీయ శ్రేణి జట్లు(ఏ జట్లు) ఆడే సిరీస్ లను అస్సలు పట్టించుకోరు. అయితే భారత్ ఏ , శ్రీలంక ఏ, ఆప్ఘనిస్థాన్ ఏ జట్ల మధ్య జరగనున్న ట్రై సిరీస్ కు ఇప్పుడు క్రేజ్ వచ్చేసింది. ఆ క్రేజ్ కు కారణం వైభవ్ సూర్యవంశీ.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో వైభవ్ పరుగుల విధ్వంసం సృష్టించాడు.

బుమ్రా నుంచి కమిన్స్ వరకూ పలువురు అంతర్జాతీయ స్టార్ బౌలర్లను ఉతికారేశాడు. ఆరెంజ్ క్యాప్ తో పాటు మరో నాలుగు అవార్డులను సొంతం చేసుకున్న వైభవ్ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. అతను ఎప్పుడు ఏ మ్యాచ్ ఆడతాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

బుడ్డోడితో ఒప్పందాల కోసం కార్పొరేట్ కంపెనీలు సైతం క్యూ కడుతున్నాయి. దీంతో తన ఎండార్స్ మెంట్ ఫీజులను కూడా డబుల్ చేసేసాడు. ఇదిలా ఉంటే వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) క్రేజ్ కారణంగా అభిమానుల్లో ఆసక్తిని గమనించిన నిర్వాహకులు ఈ ట్రై సిరీస్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనికి సంబంధించి సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ అధికారిక ప్రకటన చేసింది. సూర్యవంశీ ఎక్స్ ప్రెస్ ట్రై సిరీస్ కోసం దూసుకొస్తుంది అంటూ క్యాంపెయిన్ కూడా మొదలుపెట్టింది.

Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi

వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సోనీ సంస్థ పెద్ద ప్లాన్స్ తో రెడీ అయింది. గతంలో ఏ జట్ల సిరీస్ లు గానీ, మ్యాచ్ లు గానీ ప్రత్యక్ష ప్రసారం చేసిన సందర్భాలు లేవు. అలాంటిది ఇప్పుడు వైభవ్ క్రేజ్ ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సోనీ సంస్థ ట్రై సిరీస్ ప్రసార హక్కులను దక్కించుకుంది.

ఈ ముక్కోణపు సిరీస్ కోసం భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. తెలుగు తేజం తిలక్ వర్మ జట్టు సారథిగా బరిలోకి దిగుతుండగా ప్రియాన్ష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్ , అన్షుల్ కాంబోజ్ , ప్రభ్ సిమ్రన్ సింగ్, ఆయుశ్ బదోనీ వంటి ఐపీఎల్ స్టార్స్ ఆడుతున్నారు. ఈ సిరీస్ కు భారత జట్టు కెప్టెన్ గా తిలక్ నే ఎంపిక చేసినా అందరి దృష్టి మాత్రం వైభవ్ సూర్యవంశీపైనే ఉంది.

Annamalai : తొందరపడొద్దు..అన్నామలైకి బీజేపీ బుజ్జగింపులు

Related Articles

Back to top button