Dhoni : ధోనీని ఇక ప్లేయర్ గా చూడలేమా ?..ఈ సీజన్ లో ఆడడం కష్టమే
Dhoni : ఐపీఎల్ వచ్చిందంటే చాలు కొందరు ఆటగాళ్ల ఆటను చూసేందుకు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. ఈ జాబితాలో ముందుండే పేరు మహేంద్రసింగ్ ధోనీ
Dhoni
ఐపీఎల్ వచ్చిందంటే చాలు కొందరు ఆటగాళ్ల ఆటను చూసేందుకు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. ఈ జాబితాలో ముందుండే పేరు మహేంద్రసింగ్ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోనీ(Dhoni) ఆ తర్వాత నుంచీ కేవలం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఒకప్పటి ధోనీ(Dhoni)లా మ్యాజిక్ మాత్రం చేయలేకపోతున్నాడు.
గత సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగినా, మధ్యలో సారథిగా బాధ్యతలు చేపట్టినా చెన్నై మాత్రం అట్టడుగు స్థానానికే పరిమితమైంది. దీంతో ఆ సీజన్ తోనే మహి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అభిమానుల కోసం కొనసాగుతూ ఈ సీజన్ బరిలోనూ దిగాడు. కానీ గాయం కారణంగా ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
గత ఏడాది ధోనీ మోకాలుకి సర్జరీ జరిగింది. దానికి సంబంధించి మళ్లీ నొప్పి వస్తుండడం, కండరాల నొప్పితో ఇబ్బందిపడిన కారణంగా… ధోనీ మూడు వారాలు దూరమవుతున్నట్టు ఫ్రాంచైజీ ప్రకటించింది. అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ధోనీ గ్రౌండ్ లోకి అడుగుపెడతాడా.. అతని బ్యాటింగ్ చూసి ఎంజాయ్ చేద్దామా అంటూ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటి వరకూ 8 మ్యాచ్ లకు ధోనీ దూరమయ్యాడు. నిజానికి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు ధోనీ బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు.దీంతో ఈ మ్యాచ్ లో మహీ ఆడతాడని అభిమానులు ఆశించారు. కానీ ధోని మైదానంలోకి దిగలేదు. ఆ తర్వాత చెపాక్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతను ఆడలేదు.
ఆ మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కాగా ధోనీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్… ధోనీ ఇప్పుడు మరో గాయంతో బాధపడుతున్నట్టు సమాచారం. అందుకే హోంగ్రౌండ్ లో జరగబోయే మ్యాచ్ కు సైతం ధోనీ అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పరోక్షంగా వెల్లడించాడు.
ప్రస్తుతం ధోనీ రికవర్ అవుతున్నాడనీ, మహీని ఆడించేందుకు తాము తొందరపడడం లేదని వ్యాఖ్యానించాడు. కాగా ధోనీ ఈ సీజన్ లో ప్లేయర్ గా కనిపించడం ఇక కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
RCB : రివెంజ్ దెబ్బ అదిరిందబ్బా..ఢిల్లీని చిత్తుగా ఓడించిన ఆర్సీబీ





