Just TechnologyJust NationalLatest News

Ultra Glasses:అంధుల పాలిట మూడో కన్ను వచ్చేసింది.. ఈ ఏఐ గ్లాసెస్ ప్రత్యేకతలేంటి?

Ultra Glasses: తెలుగుతో పాటు దేశంలోని 18 లాంగ్వేజులను ఏఐ గ్లాసెస్ చదవగలవు. చేతితో రాసిన డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌లు, న్యూస్ పేపర్లు, పుస్తకాలను కూడా ఇవి చదివి వినిపిస్తాయి.

Ultra Glasses

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పేరే వినిపిస్తుంది. ఒకవిధంగా చెప్పాలంటే ప్రతీ మనిషి జీవితంలో ఏఐ భాగం అయిపోయింది. తాజాగా బ్లైండ్ పీపుల్‌ జీవితంలో కూడా ఏఐ ఎంట్రీ ఇచ్చింది. వీరి కోసం బెంగళూరులోని నారాయణ నేత్రాలయ, ఎస్​హెచ్​జీ(SHG) టెక్నాలజీస్ కలిసి స్మార్ట్ విజన్ అల్ట్రా గ్లాసెస్‌(Ultra Glasses)ను తయారు చేశాయి.

ఇవి చూడటానికి సాధారణ కళ్లద్దాల్లాగే ఉన్నా, అంధులకు ఇవి ఒక మంచి గైడ్ లా పనిచేస్తాయి. పదేళ్ల క్లినికల్ అనుభవంతో రూపొందించిన ఈ గ్లాసెస్, చూపు లేని వారు ఇతరులపై ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకునేలా ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి.

ఈ స్మార్ట్ విజన్ అల్ట్రా గ్లాసెస్‌(Ultra Glasses).. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాయంతో పని చేస్తాయి. వీటిలో అమర్చిన ‘లైడార్’ (LiDAR) సెన్సార్ వస్తువులను నిరంతరం స్కాన్ చేస్తుంది. గ్లాసెస్ ధరించిన వారి ముందు ఎవరున్నారు? ఏ వస్తువులు ఉన్నాయి? వారికి అడ్డంగా ఏమైనా వస్తున్నాయా? అన్న విషయాన్ని బ్లూటూత్ స్పీకర్ ద్వారా ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉంటుంది. కేవలం వస్తువులనే కాదు మనుషులను కూడా ఇవి గుర్తిస్తాయి. అంతేకాదు మెట్రో స్టేషన్లలో ఉండే సైన్ బోర్డులు, దారిని చూపే గుర్తులను కూడా ఇవి చదివి వినిపిస్తాయి.

ఈ గ్లాసెస్‌లో ఉన్న మరో ఆశ్చర్యకరమైన ఫీచర్ ఏంటంటే, ఇవి తెలుగుతో పాటు దేశంలోని 18 లాంగ్వేజులను చదవగలవు. చేతితో రాసిన డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌లు, న్యూస్ పేపర్లు, పుస్తకాలను కూడా ఇవి చదివి వినిపిస్తాయి. అంతేకాకుండా, కరెన్సీ నోట్లను గుర్తించడం, రంగులను గుర్తుపట్టడం వంటి పనులను కూడా ఈజీగా చేస్తాయి. దీనివల్ల వస్తువుల కొనుగోలు సమయంలో అంధులు ఎవరి సాయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు.

Ultra Glasses
Ultra Glasses

అత్యవసర కాలింగ్ ఫీచర్ (SOS) కూడా ఉండటం ఈ గ్లాసెస్‌ స్పెషాలటీ . దీని ద్వారా డేంజర్లో ఉన్నప్పుడు సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తే చాలు.. మన లొకేషన్, మనం చివరిగా మాట్లాడిన మాటలు , పరిసరాల చిత్రాలను డైరక్టుగా మనకు కావలసిన వారికి (Emergency Contacts) మెసేజ్ రూపంలో పంపిస్తాయి.

ఇక స్మార్ట్ విజన్ అల్ట్రా గ్లాసెస్‌ కాస్ట్ జీఎస్టీతో కలిపి దాదాపు రూ. 46,000 గా నిర్ణయించారు. ఇది మధ్యతరగతి వారికి కాస్త ఎక్కువగానే ఉన్నా.. విదేశీ గ్లాసెస్ ఆర్కామ్ వంటి వాటితో పోలిస్తే చాలా తక్కువ. పేద రోగుల కోసం ప్రభుత్వ పథకాలతో పాటు వీటిని ఉచితంగా అందించేలా కూడా డాక్టర్లు కృషి చేస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Back to top button