Just TechnologyJust CrimeLatest News

Online Games : ఇకపై ఆన్‌లైన్ ఆటలపై ప్రభుత్వ నిఘా..మే 1 నుంచి కఠిన నిబంధనలు

Online Games : ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ - 2025 పేరుతో రూపొందించిన కొత్త చట్టం .. మే 1 వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది.

Online Games

దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తూ ఎందరో జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని క్రమబద్ధీకరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ – 2025 పేరుతో రూపొందించిన కొత్త చట్టం .. మే 1 వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ఈ చట్టం ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (OGA) అనే న్యూ రెగ్యులేటరీ బాడీని కేంద్రం ఏర్పాటు చేస్తోంది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ (Information Technology Department) పరిధిలో పని చేసే ఈ కంపెనీ పూర్తిగా డిజిటల్ రూపంలో యాక్టివిటీస్ నిర్వహించబోతోంది. దీనికి చైర్‌పర్సన్‌గా కేంద్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి వ్యవహరించనుండగా, హోం, ఆర్థిక, క్రీడా , న్యాయ శాఖలకు చెందిన సంయుక్త కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. దీనితో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ తాజాగా అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

కొత్త నిబంధనల ప్రకారం, ఆన్‌లైన్ గేమ్‌ల(Online Games) గుర్తింపు, కంట్రోల్ విషయంలో క్లియర్ రూల్స్‌ను విధించారు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఆడే సాధారణ గేమ్‌లకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. అయితే, ఏదైనా గేమ్ డెవలపర్ తమ గేమ్ మనీ గేమింగ్ పరిధిలోకి రాదని అఫీషియల్‌గా ధ్రువీకరించుకోవాలనుకుంటే వాలెంటరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

అదే సమయంలో క్యాష్ ప్రైజ్ ల ఆశ చూపి ప్లేయర్ల నుంచి డిపాజిట్లు కానీ ఫీజులు కానీ వసూలు చేసే ఆటలను ఈ చట్టం పూర్తిగా బ్యాన్ చేసింది. ఇటువంటి మనీ గేమ్‌లకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు నిర్వహించబడవు. అయితే, ఈ-స్పోర్ట్స్ (E-Sports) కేటగిరీ కింద వచ్చే గేమ్‌లు మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందాల్సి ఉంటుంది.

ఒక గేమ్ అనుమతించదగిన సామాజిక క్రీడా , బ్యాన్ చేసిన మనీ గేమా అనేది ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ మూడు ప్రత్యేక పరిస్థితుల్లో నిర్ణయిస్తుంది. ఏదైనా ఆన్‌లైన్ గేమ్‌ (Online Games)పై అనుమానం వస్తే అథారిటీ స్వయంగా విచారణ జరిపే అధికారం కలిగి ఉంటుంది. అలాగే, వినియోగదారుల డేటా సేఫ్టీకి సంబంధించి ఆదేశాలు జారీ చేసే హక్కు కూడా ఈ సంస్థకు ఉంటుంది.

ఈ చట్టాన్ని రూపొందించే సమయంలో 2025 అక్టోబరులో వివిధ ఇండస్ట్రీ వర్గాల నుంచి సుమారు 2,500 సలహాలను ప్రభుత్వం స్వీకరించింది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిబంధనలను వీలైనంత ఈజీగా ఉంచామని, రియల్ మనీ గేమ్‌లను అరికడుతూనే ఈ-స్పోర్ట్స్ , సోషల్ గేమ్‌లను ప్రోత్సహించడమే ఈ చట్టం మెయిన్ ఉద్దేశమని అధికారులు క్లారిటీ ఇచ్చారు.

Online Games
Online Games

ఈ-స్పోర్ట్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి ట్రాన్స్ పరెన్సీగా ఉండనుంది. గేమ్ డెవలపర్లు స్పెషల్‌గా ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. సదరు గేమ్ కేవలం ప్లేయర్ యొక్క స్కిల్ మీద మాత్రమే ఆధారపడి ఉందని, దానిలో ఎలాంటి జూదం లేదా బెట్టింగ్ లేదని నిరూపించే పత్రాలను సబ్‌మిట్ చేయాలి.

గేమ్ యొక్క సాఫ్ట్‌వేర్ కోడ్‌ను కూడా కేంద్ర ప్రభుత్వ నిపుణులు నిశితంగా పరిశీలిస్తారు. దీనిలో ఎలాంటి మాల్‌వేర్ లేదని, వినియోగదారుల పర్సనల్ డేటాకు ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించుకున్న తర్వాతే.. అనుమతులు మంజూరు చేస్తారు. గేమింగ్ రంగంలో పారదర్శకత తీసుకురావడానికి , యూత్‌ను తప్పుడు మార్గాల నుంచి రక్షించడానికి ఈ కొత్త చట్టం చాలా దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Avakaya : ఆవకాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా? నిల్వ చేయడానికి ఇంకా చాలా పద్ధతులున్నాయ్..

Related Articles

Back to top button