Just TechnologyJust LifestyleLatest News

Internet : ఒక్క రోజు ఇంటర్నెట్ ఆగిపోతే ప్రపంచం ఏమవుతుంది? ఆ 24 గంటలలో జరిగే షాకింగ్ థింగ్స్ ఏంటి?

Internet : ఏది ఏమైనా ఒక్క రోజు ఇంటర్నెట్ లేకపోవడం అనేది జరిగితే మాత్రమే అది ప్రపంచానికి అప్రకటిత లాక్‌డౌన్ అవుతుందని నిపుణులు అంటున్నారు.

Internet

ఈ రోజుల్లో ఉదయం లేచింది మొదలు నైట్ పడుకునే వరకు ఇంటర్నెట్ లేనిదే అస్సలు గడవని పరిస్థితిలో ఉన్నాం. చేతిలో మొబైల్, అందులో డేటా ఉంటేనే మనందరి జీవితం నడుస్తుంది. అలాంటిది ఒక్క సారే ఏదో పెద్ద టెక్నికల్ ప్రాబ్లం వల్ల.. కేవలం ఒక్క రోజు అంటే 24 గంటలు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్(Internet) పూర్తిగా ఆగిపోయిందనుకోండి.

చివరికి మొబైల్‌లోనూ.. ఆఫీస్‌లో నెట్ కూడా అస్సలు పని చేయకపోతే.. అప్పుడు ప్రపంచం ఎలా మారుతుంది? రీల్స్, చాటింగ్ ఆగిపోవడం మాత్రమేనా.. లేక అంతకంటే పెద్ద విలయం ఏమైనా జరుగుతుందా అన్న ప్రశ్నలు కొంతమందిలో తలెత్తుతాయి.

అయితే ఒకరోజు సంపూర్ణ బ్లాకౌట్ జరిగితే రియాలిటీలో ఏం జరుగుతుందనేది ఒకసారి పరిశీలిస్తే.. మొదటగా ఫైనాన్షియల్ కొలాప్స్ అంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం మనకు తగిలే అతిపెద్ద షాక్ అని నిపుణులు వివరిస్తున్నారు. ఇంటర్నెట్(Internet) ఆగిపోయిన వెంటనే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ పేమెంట్స్ అన్నీ కూడా ఆగిపోతాయి.

జేబులో క్యాష్ క్యారీ చేసే అలవాటు లేకపోవడం వల్ల మెడికల్ షాపులో మందులు గానీ, కిరాణా కొట్టులో పాలు గానీ కొనే ఛాన్స్ ఉండదు. బ్యాంకులలో సర్వర్లు బంద్ అయిపోతాయి. అన్నిటికంటే ఘోరంగా ప్రపంచ షేర్ మార్కెట్లు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పూర్తిగా స్థంభించిపోతాయి. కేవలం ఆ ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 80 నుంచి 90 వేల కోట్ల భారీ నష్టం వాటిల్లుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతేకాకుండా ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ కూడా స్తంభించిపోతాయి. ఇంటర్నెట్ లేకపోతే జీపీఎస్ (GPS) సిస్టమ్స్ అస్సలేమీ పని చేయవు. దీనివల్ల గాల్లో ప్రయాణించే వందలాది విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కష్టంగా మారిపోతుంది. చాలా వరకు విమాన సర్వీసులన్నిటినీ రద్దు చేయాల్సి వస్తుంది.

రోడ్ల మీద నడిచే ఓలా, ఉబర్ , ర్యాపిడో వంటి క్యాబ్‌లు కూడా ఎక్కడికక్కడే ఆగిపోతాయి. ఆన్‌లైన్ రైల్వే బుకింగ్స్, బస్ బుకింగ్స్ అన్నీ కూడా పూర్తిగా బంద్ అవుతాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ డెలివరీలు, జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీలు కూడా నిలిచిపోతాయి.

Internet
Internet

ఇక కమ్యూనికేషన్ పూర్తిగా బ్లాకౌట్ అయిపోతుంది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఈమెయిల్స్ ఇలాంటివేవీ పని చేయవు. మన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారో తెలుసుకోవడం కూడా కష్టమవుతుంది. కేవలం పాతకాలంలా నార్మల్ ఫోన్ కాల్స్ , ఎస్ఎమ్ఎస్ (SMS) లు మాత్రమే దిక్కవుతాయి. కానీ, ప్రపంచంలోని కోట్లాదిమంది ప్రజలు ఒకేసారి నార్మల్ కాల్స్ చేయడం మొదలుపెడితే.. మొబైల్ నెట్‌వర్క్ టవర్లు ఆ లోడ్‌ను తట్టుకోలేక జామ్ అయిపోతాయి. దాంతో నార్మల్ కాల్స్ కూడా కలవవు.

అంతేకాకుండా హాస్పిటల్స్, ఐటీ రంగంలో గందరగోళం ఏర్పడుతుంది. ప్రస్తుతం పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో పేషెంట్ల డేటా నుంచి ల్యాబ్ రిపోర్ట్స్ వరకూ అన్నీ క్లౌడ్ సర్వర్లలో ఇంటర్నెట్ ద్వారానే స్టోర్ అవుతుంటాయి. ఇంటర్నెట్ లేకపోతే డాక్టర్లకు రోగుల పాత హిస్టరీ తెలియక ట్రీట్మెంట్ లేట్ అవుతుంది. ఇక ఐటీ, సాఫ్ట్‌వేర్ కంపెనీల గురించి చెప్పక్కర్లేదు. వరల్డ్ వైడ్‌గా ఐటీ ఆఫీసులన్నీ మూతపడతాయి. ఐటీ ఎంప్లాయిస్‌కు అఫీషియల్ హాలిడే ప్రకటించడం తప్ప వేరే మార్గం ఉండదు.

Internet
Internet

అయితే వీటన్నిటి మధ్య ఒక చిన్న పాజిటివ్ విషయం కూడా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అదేంటంటే.. జనాల్లో ఉండే స్క్రీన్ అడిక్షన్ తగ్గుతుంది.పిల్లలు ఫోన్లు పక్కన పెట్టి అవుట్‌డోర్ గేమ్స్ ఆడుకుంటారు. డిజిటల్ వరల్డ్ నుంచి బయటకు వచ్చి, జనం పక్కన ఉన్న మనుషులతో మాట్లాడటం మొదలుపెడతారు. సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం ఆరాటపడే మైండ్..ఒక్కసారిగా రిలాక్స్ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాకపోతే, లేటెస్ట్ ప్రపంచం ఇంటర్నెట్‌పై ఎంతలా ఆధారపడిపోయిందంటే.. ఒక్క రోజు ఇంటర్నెట్ పోతే వచ్చే నష్టాలు, గందరగోళం ముందు ఈ పాజిటివ్ విషయాలన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తుంటాయి. ఏది ఏమైనా ఒక్క రోజు ఇంటర్నెట్ లేకపోవడం అనేది జరిగితే మాత్రమే అది ప్రపంచానికి అప్రకటిత లాక్‌డౌన్ అవుతుందని నిపుణులు అంటున్నారు.

Body : మీ బాడీలో ఈ 7 సిగ్నల్స్ లైట్ తీసుకుంటున్నారా? అవి మీ ఆరోగ్యంపై శరీరం ఇచ్చే లీకులట..

Related Articles

Back to top button