Just TechnologyLatest News

What’s App : వాట్సాప్‌లో నో మోర్ ఫోన్ నెంబర్స్.. మీ యూజర్‌నేమ్ ఇప్పుడే లాక్ చేసుకోండి

What's App: యూజర్ల సేఫ్టీ కోసం ఫోన్ నెంబర్‌తో పని లేకుండానే చాటింగ్ చేసుకునే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు మెటా సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

What’s App

వాట్సాప్ ప్రైవసీని మార్చేసే బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఇకపై ఎవరితోనైనా వాట్సాప్‌లో చాట్ చేయాలంటే మీ పర్సనల్ మొబైల్ నెంబర్ చెప్పాల్సిన అవసరం ఉండదు. కేవలం యూజర్‌నేమ్ ఉంటే సరిపోతుంది.

యూజర్ల సేఫ్టీ కోసం ఫోన్ నెంబర్‌తో పని లేకుండానే చాటింగ్ చేసుకునే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు మెటా సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. వచ్చే వారం నుంచే ఈ యూజర్‌నేమ్ రిజర్వేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతోంది. ఈ ఏడాదిలోపే యూజర్లందరికీ ఈ సరికొత్త సిస్టమ్ అందుబాటులోకి రాబోతోంది.

ఈ కొత్త ఫీచర్ ప్రకారం వాట్సాప్‌లో ఎలాంటి పబ్లిక్ యూజర్‌నేమ్ డైరెక్టరీ కూడా ఉండదు. అంటే మీ ఒరిజినల్ యూజర్‌నేమ్ కచ్చితంగా తెలిస్తేనే.. ఎదుటి వ్యక్తి మీకు ఫస్ట్ టైమ్ మెసేజ్ చేయగలడన్న మాట.

ఒకసారి మీరు యూజర్‌నేమ్ సెట్ చేసుకున్నాక, కొత్తగా ఎవరికైనా సరే మెసేజ్ పంపితే మీ మొబైల్ నెంబర్ అవతలి వాళ్లకు కనిపించదు. పర్సనల్ నెంబర్ ఇతరులకు షేర్ చేయడం ఇష్టం లేని వాళ్లకు ఈ ఫీచర్ ఒక సూపర్ ప్రైవసీ షీల్డ్‌లా పనిచేస్తుంది.

దీంతో పాటు యూజర్‌నేమ్ కీ అనే ఎక్స్‌ట్రా ప్రైవసీ ఆప్షన్‌ను కూడా వాట్సాప్(What’s App) రెడీ చేస్తోంది. ఈ ఫీచర్ గనుక ఆన్ చేస్తే.. మీ యూజర్‌నేమ్ తెలిసినా సరే, ఈ స్పెషల్ కీ లేకపోతే ఎవరూ మీకు మెసేజ్ పంపలేరు.

క్రియేటర్లు, చిన్నచిన్న బిజినెస్‌ నడిపేవాళ్లు తమ బ్రాండ్ నేమ్స్ మిస్ కాకుండా ఉండటానికి వాట్సాప్ ఒక మంచి ఛాన్స్ ఇస్తోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌లో వాడుతున్న యూజర్‌నేమ్‌లనే వాట్సాప్‌లో కూడా ముందే రిజర్వ్ చేసుకోవచ్చు.

What's App
What’s App

ఒకవేళ మీకు నచ్చిన యూజర్‌నేమ్ అప్పటికే ఎవరైనా తీసేసుకుంటే.. దానికి సిమిలర్‌గా ఉండే ఇతర ఆప్షన్లను సజెస్ట్ చేయడం కోసం వాట్సాప్ ఒక యూజర్‌నేమ్ జనరేటర్ టూల్‌ను కూడా అందిస్తోంది.

మీ వాట్సాప్(What’s App) యూజర్‌నేమ్‌ను ఎలా రిజర్వ్ చేసుకోవాలంటే.. ఇప్పటికే ఈ ఫీచర్ రోల్ అవుట్ అవుతోంది. మీ అకౌంట్‌కు ఈ అప్‌డేట్ రాగానే సింపుల్‌గా ఈ స్టెప్స్ ఫాలో అయి మీ పేరును లాక్ చేసుకోవచ్చు.

మీ మొబైల్‌లో వాట్సాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ (Settings) లోకి వెళ్లాలి. అక్కడ ఉండే వాట్సాప్ అకౌంట్ (Account) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో కనిపించే యూజర్‌నేమ్ (Username) ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన యూనిక్ నేమ్‌ను టైప్ చేసి సేవ్ చేసుకోవాలి.

Janasena : జెండాలు మోసే చేతులే ఇక రూలర్స్.. ఏపీ పాలిటిక్స్‌లో పవన్ కళ్యాణ్ క్రేజీ ఎక్స్పెరిమెంట్

Related Articles

Back to top button