Just TelanganaJust PoliticalLatest News

CM Revanth : 2029 జూన్‌లోనే ఎన్నికలు..సీఎం రేవంత్ సంచలన ప్రకటన

CM Revanth : ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భద్రాద్రి రాముడిపై ఒట్టేసి సవాల్ విసిరిన రేవంత్ కేసీఆర్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పించారు.

CM Revanth

తెలంగాణ సీఎం రేవంత్(CM Revanth) రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఖమ్మం పర్యటనలో భాగంగా బహిరంగసభలో ప్రసంగించిన రేవంత్ వచ్చే ఎన్నికలు 2029 జూన్‌లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆమోదం పొందనున్న సమయంలో.. తెలంగాణలో కొత్తగా పెరగనున్న ఎమ్మెల్యే, ఎంపీ సీట్లపైనా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య భారీగా పెరగనున్నట్టు చెప్పారు.

డీలిమిటేషన్ బిల్లు కచ్ఛితంగా ఆమోదం పొందుతుందన్న రేవంత్(CM Revanth).. తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 26కు పెరుగుతాయన్నారు. అలాగే అసెంబ్లీ స్థానాలు 182కు పెరగనున్నట్టు తెలిపారు. అదే సమయంలో కొత్తగా పెరగబోతున్న స్థానాల ప్రకారం కాంగ్రెస్ గెలవబోయే లెక్కలను కూడా ఇదే వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 182 అసెంబ్లీ స్థానాల్లో 117 స్థానాలు గెలిచి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. భద్రాద్రి రాముడి మీద ఆన.. ఇది కాంగ్రెస్ కార్యకర్తల ప్రతిన అంటూ ఆవేశపూరిత ప్రసంగం చేశారు.

గతంలో తాను చెప్పిన రాజకీయ జోస్యం ఎలా నిజమైందో గుర్తు చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 65 సీట్లతో అధికారంలోకి వస్తుందని తాను స్పష్టంగా చెప్పాననీ, దానికి తగ్గట్టే 64 సీట్లు గెలిచామన్నారు. ఇప్పుడు అదే నమ్మకంతో ఖమ్మం గడ్డపైనుంచి మరోసారి స్పష్టంగా చెబుతున్నానంటూ వ్యాఖ్యానించారు.

ఇదే సభలో ప్రతిపక్ష బీఆర్ఎస్‌పై రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భద్రాద్రి రాముడిపై ఒట్టేసి సవాల్ విసిరిన రేవంత్ కేసీఆర్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని కౌరవవంశంతో పోల్చడం కూడా దుమారం రేపింది. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాజకీయాల నుంచి తుడిచి పెట్టేవరకూ కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరని వ్యాఖ్యానించారు.

CM Revanth
CM Revanth

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన కేసీఆర్‌ను గత ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్‌కు పరిమితం చేసామన్నారు. మళ్లీ మాయమాటలతో, మోసపూరిత ప్రసంగాలతో ప్రజల్లోకి రావడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ నేతలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. కేసీఆర్ కాసుకోవాలని , ఆయన సర్వేలను, గులాబీ పార్టీ నేతలను ఓడించి చూపిస్తామంటూ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

అటు బీజేపీ కూడా తెలంగాణలో అధికారం అంటూ కలలు కంటోందని, వారి ఆశలు నెరవేరవన్నారు. మోదీ, అమిత్ షా ఇతర పార్టీలను లొంగదీసుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమన్నారు.

CM Vijay : కరూర్ తొక్కిసలాటపై విజయ్ సంచలన వ్యాఖ్యలు.. సీఎం ప్రశ్నలతో మళ్లీ తెరపైకి పోలీస్ వ్యవస్థ తీరు

Related Articles

Back to top button