Just TelanganaLatest News

GHMC shocks: అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు GHMC షాక్

GHMC shocks: జీహెచ్‌ఎంసీ ట్రేడ్ లైసెన్స్ విభాగం ఈ విషయంలో లోతుగా దర్యాప్తు చేసి, వెంటనే పూర్తి ఫీజులు చెల్లించాలని అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోల యజమానులను ఆదేశించింది.

GHMC shocks

హైదరాబాద్‌లోని చారిత్రక స్టూడియోలైన అన్నపూర్ణ స్టూడియోస్ మరియు రామానాయుడు స్టూడియోస్‌లకు జీహెచ్‌ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజు (Trade License Fee) బకాయిలకు సంబంధించి నోటీసులు(GHMC shocks) జారీ చేశారు. ఈ రెండు స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపిస్తూ భారీ స్థాయిలో పన్నులు ఎగవేశాయని అధికారులు గుర్తించారు. జీహెచ్‌ఎంసీ ట్రేడ్ లైసెన్స్ విభాగం ఈ విషయంలో లోతుగా దర్యాప్తు చేసి, వెంటనే పూర్తి ఫీజులు చెల్లించాలని ఆదేశించింది.

GHMC అధికారులు చేసిన తనిఖీలలో, ఈ రెండు స్టూడియోలు తమకు చెల్లించాల్సిన అసలు ట్రేడ్ లైసెన్స్ ఫీజులో చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తున్నట్లు వెల్లడైంది. వ్యాపార విస్తీర్ణం (Business Area) ఆధారంగా లెక్కించాల్సిన ఫీజులను తక్కువగా చూపించడం ద్వారా ఈ ఎగవేత జరిగినట్లు అధికారులు నిర్ధారించారు.

రామానాయుడు స్టూడియోస్ చెల్లించాల్సిన అసలు ఫీజు: అధికారుల లెక్కల ప్రకారం, రామానాయుడు స్టూడియోస్ చెల్లించాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు మొత్తం రూ. 1,92,000.

అయితే, ఈ స్టూడియో కేవలం రూ. 1,900 మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే, చెల్లించాల్సిన మొత్తంలో కేవలం 1% కంటే తక్కువ ఫీజునే చెల్లిస్తున్నారు.

GHMC shocks
GHMC shocks

అన్నపూర్ణ స్టూడియోస్ చెల్లించాల్సిన అసలు ఫీజు: అన్నపూర్ణ స్టూడియోస్ చెల్లించాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు భారీగా రూ. 11,52,000.

అయితే ఈ స్టూడియో కేవలం రూ.49,000 మాత్రమే చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ కూడా అసలు ఫీజుతో పోలిస్తే చెల్లిస్తున్న మొత్తం చాలా తక్కువగా ఉంది.

కొన్నేళ్లుగా ఈ స్టూడియోలు ఈ విధంగా తప్పుడు లెక్కలు చూపిస్తూ పన్నులు ఎగవేస్తున్నట్లు GHMC అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నగరంలో పన్నుల వసూలును పెంచడం వ్యాపార సంస్థలలో పారదర్శకతను తీసుకురావడం లక్ష్యంగా GHMC ఈ తనిఖీలను నిర్వహిస్తోంది.

దీనిలో భాగంగానే GHMC అధికారులు తాజాగా ఈ రెండు స్టూడియోల(GHMC shocks )కు ట్రేడ్ లైసెన్స్ ఫీజు బకాయిలను పూర్తిగా అది కూడా తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. స్టూడియో యాజమాన్యాలు ఈ నోటీసులపై ఎలా స్పందిస్తాయి , బకాయిలను ఎప్పుడు చెల్లిస్తాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సినీ నిర్మాణ రంగానికి చెందిన ప్రముఖ సంస్థలకే ఇలా నోటీసులు జారీ చేయడం.. హైదరాబాద్ నగరంలో పన్నుల వసూలు విషయంలో GHMC (GHMC shocks)కఠినంగా ఉండటంపై సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button