Mee Ticket APP : హైదరాబాదీలకు బిగ్ రిలీఫ్..ఒకే కార్డు ఎన్నో సర్వీసులు..
Mee Ticket APP : యాప్‌లో ఎక్కాల్సిన స్టాప్, దిగాల్సిన డెస్టినేషన్‌ను సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయగానే.. క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ టికెట్ మీ స్క్రీన్ మీదకు వస్తుంది.
Mee Ticket APP
ట్రాఫిక్ ఇబ్బందులు, క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడే చిరాకులు, ప్రతీచోటా టికెట్ల కోసం వెయిటింగ్ టెన్షన్.. హైదరాబాద్‌లో సామాన్యుల రోజువారీ లైఫ్‌లో ఇవన్నీ కామన్ విషయాలు. అయితే ఇకపై ఆ తిప్పలన్నింటికీ కంప్లీట్ ఎండ్ కార్డ్ పడుతోంది. సిటీ రోడ్లపై బస్సు మారాలన్నా, మెట్రో ట్రైన్ ఎక్కాలన్నా చేతిలో ఒకే ఒక్క మ్యాజిక్ పాస్ ఉంటే సరిపోతుంది. హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థను డిజిటల్ విప్లవం వైపు తీసుకెళ్తూ తెలంగాణ సర్కార్ పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది.
తాజాగా ప్రారంభమైన ఉమ్మడి పాస్ అండ్ మీ టికెట్ మొబైల్ యాప్(Mee Ticket APP) ఇప్పుడు సిటీవాసులకు అల్టిమేట్ ఆప్షన్‌గా మారాయి. రోజూ సిటీలో 25 లక్షల మంది సిటీ బస్సుల్లోనూ, మరో 4.50 లక్షల మంది మెట్రో ట్రైన్స్‌లోనూ ప్రయాణిస్తుంటారు.
వీరిలో ఎక్కువమంది ఈ రెండు ట్రాన్స్‌పోర్టేషన్ రూట్స్ వాడుతుండటంతో ఆర్టీసీ, మెట్రో సర్వీసులను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకువచ్చారు. ఈ జాయింట్ పాస్‌లు మెట్రో స్టేషన్లన్నింటి వద్ద అవౌలబుల్ ఉంటాయి. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపల తిరిగే అన్ని రకాల ఏసీ, నాన్ ఏసీ బస్సులతో పాటు మెట్రో రైళ్లలో కూడా ఈ పాస్‌తో జర్నీ చేయొచ్చు. కేవలం పుష్పక్ ఏసీ బస్సులకు మాత్రమే ఈ పాస్‌తో ప్రయాణించలేరు.
హైదరాబాదీల జర్నీని మరింత ఈజీ చేస్తూ తాజాగా తీసుకొచ్చిన మీ టికెట్ యాప్(Mee Ticket APP) ఒక మల్టీ టాస్కింగ్ వండర్ అనే చెప్పాలి. కండక్టర్ ముందు చిల్లర కోసం వెతుక్కోవడం లేదంటే క్యూలో నిల్చోవడానికి ఇక చెక్ పడిపోయినట్లే. యాప్‌లో ఎక్కాల్సిన స్టాప్, దిగాల్సిన డెస్టినేషన్‌ను సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయగానే.. క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ టికెట్ మీ స్క్రీన్ మీదకు వస్తుంది. జర్నీలో కండక్టర్‌కు ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుంది.

అంతేకాదు, ఈ ఒక్క యాప్‌తోనే తెలంగాణలోని 15 ఫేమస్ దేవాలయాల దర్శన టికెట్లు, లుంబిని పార్క్, కేబీఆర్ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, బొటానికల్ గార్డెన్, కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ వంటి టూరిస్ట్ స్పాట్ల ఎంట్రీ పాస్‌లు కూడా బుక్ చేసుకోవచ్చు.
దుర్గం చెరువు బోటింగ్, వాటర్ ఫాల్స్ ఎంట్రీలు, తెలంగాణలోని 6 ఫేమస్ మ్యూజియంల ఎంట్రీ , ట్రెకింగ్ ప్యాకేజీలు కూడా ఈ యాప్ ద్వారానే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. చివరికి మీ ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు దగ్గరలో ఉన్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి అడ్రస్ కూడా ఈ యాప్ పక్కాగా చూపిస్తుంది.
Potatoes In The Fridge : ఫ్రిడ్జ్‌లో ఆలుగడ్డలు పెడుతున్నారా? అయితే మీరిది తప్పకుండా చదవాల్సిందే..





