Narendra Modi : రేవంత్ జీ వింటున్నారాా ?..మోదీ ఛలోక్తులు
Narendra Modi : ప్రధాని మోదీ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, నా మాటలను జాగ్రత్తగా వినండి అని సరదాగా వ్యాఖ్యానించారు.
Narendra Modi
ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) హైదరాబాద్ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న వెంటనే నేరుగా హెచ్ఐసీసీకి వెళ్లిన ఆయన అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ , బీజేపీ కీలక నేతలు హాజరయ్యారు.
ఈ వేదికపై ప్రధాని(Narendra Modi) దాదాపు రూ.9377 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి వేదికపై ప్రధానికి కీలక విజ్ఞప్తి చేశారు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో అదే తరహాలో మోదీ గారు తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
రేవంత్ విజ్ఞప్తిపై మోదీ ఇదే వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు ఛలోక్తులు విసిరారు. రేవంత్ రాజకీయాలు మాట్లాడనని చెప్పారనీ, తాను కూడా రాజకీయాలు మాట్లాడనన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై మోదీ గణాంకాలతో సహా వివరించారు. రేవంత్ జీ వింటున్నారా అంటూ మాట్లాడిన మోదీ ఉమ్మడి ఏపీలో రైల్వే బడ్జెట్ కేటాయింపుల గురించి ప్రస్తావించారు.

గతంలో తెలంగాణకు రైల్వే బడ్జెట్ లో రూ.1000 కోట్లు కూడా దక్కేవి కావన్నారు. కానీ ఇప్పుడు ఒక్క తెలంగాణకే రూ.5500 కోట్లు కేటాయించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల రైల్వే పనులు శరవేగంగా జరుగుతున్నాయని మోదీ వెల్లడించారు. తెలంగాణకు ఇప్పటికే 5 వందే భారత్, 6 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇచ్చామని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఐటీ రంగానికి సంబంధించి హైదరాబాద్ ప్రాధాన్యతను మోదీ ప్రశంసించారు. దేశాభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సైబర్ టెక్నాలజీ, ఈవీ వంటి రంగాల్లో హైదరాబాద్ నగరం అగ్రగామిగా ఉందన్నారు. వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయనీ, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. తమతో కలవండి అంటూ రేవంత్ తో మోదీ చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. తెలంగాణ అభివృద్ధికి మాతో కలిసి రావాలంటూ మోదీ రేవంత్ కు సూచించారు.
Mother :ప్రతీ ఇంట్లో ఉండే దైవం అమ్మ.. మది నిండా అమ్మ జ్ఞాపకాలను నెమరువేసుకోండి..





