Pawan Kalyan : పవన్ సభకు నో పర్మిషన్..కోర్టుకెళ్లిన జనసేన.. ఏం జరగబోతోంది ?
Pawan Kalyan : తెలంగాణ జనసేన కీలక సమావేశానికి గచ్చిబౌలీ సంధ్య కన్వెన్షన్‌లో సిద్ధమవుతుండగా, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరగాల్సిన ఈ భేటీకి పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం.
Pawan Kalyan
తెలంగాణ రాజకీయాల్లో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ తర్వాత జరిగిన పరిణామాలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పవన్ ను టార్గెట్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అదే సమయంలో జనసేన నేతలు పెద్దగా కౌంటర్ ఇవ్వలేకపోయారు. నాగేశ్వర్ ఎపిసోడ్ పై పవన్ స్పందించినా ఫలితం లేకపోయింది.
ఈ నేపథ్యంలో జూన్ 2న తెలంగాణ జనసేన కీలక సమావేశానికి సిద్ధమైంది. గచ్చిబౌలీ సంధ్య కన్వెన్షన్ వేదికగా తన పార్టీ శ్రేణులతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) భేటీ కానున్నారు. ఈ మీటింగ్ కు తెలంగాణ జనసేన నేతలు, పార్టీ కార్యకర్తలు భారీగానే హాజరవనున్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసుల అనుమతి కోరుతూ జనసేన నాయకులు లేఖ రాశారు.
అయితే అనూహ్యంగా ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు.తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, శాంతి భద్రతల దృష్ట్యా ఈ మేరకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించారు.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పవన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు పవన్ కు తెలంగాణలో పనేంటని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నమే తినలేదంటూ మాట్లాడిన పవన్ తన పార్టీ మీటింగ్స్ ఏపీలో పెట్టుకోవాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అటు కవిత, ఇతర పార్టీల నేతలు కూడా పవన్ తెలంగాణ మీటింగ్ పై విమర్శలు గుప్పించారు.

అయితే దీనికి తెలంగాణ జనసేన నేతలు కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అనుమతి నిరాకరించారంటూ మండిపడ్డారు. తాము సభ పెట్టుకోవడం లేదనీ, ఇది సమావేశం మాత్రమేనని జనసేన నేతలు చెబుతున్నారు.
పార్కింగ్ కారణాలను చూపుతూ అనుమతి నిరాకరించడం సరికాదన్న జనసేన నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు, సభకు ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని లీగల్ గా గెలిచి సభను ఏర్పాటు చేసుకుంటామని జనసేన నేతలు చెబుతున్నారు. దీంతో మంగళవారం కోర్టు అనుమతి రాకుంటే జనసేన ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Passport : 3 రోజుల్లోనే పాస్‌పోర్ట్..అప్లై చేయడానికి కావలసిన 4 ఈజీ స్టెప్స్ ఇవే





