Just TelanganaJust PoliticalLatest News

Telangana Cabinet : సురేఖ బర్తరఫ్‌తో కేబినెట్‌పై కొత్త చర్చ..ఆ మూడు బెర్తుల కోసం ఎవరి పేర్లు వినిపిస్తున్నాయి..

Telangana Cabinet : సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Telangana Cabinet

సురేఖ బర్తరఫ్‌తో తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చుట్టూనే అసలు చర్చ అంతా తిరుగుతోంది. ఒక మంత్రి పదవి ఖాళీ అవడం సాధారణంగా జరిగే రాజకీయ పరిణామమే కావొచ్చు.. కానీ ఇప్పటికే ఖాళీగా ఉన్న ప్లేసులతో కలిపి మొత్తం 3 బెర్తులు భర్తీ చేయాల్సిన సిచ్యువేషన్ రావడంతో కాంగ్రెస్‌లో ఆశావహుల లెక్కలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత.. ఇక కేబినెట్‌లోకి ఆ ప్లేస్ ఎవరికి దక్కబోతోందన్న ప్రశ్న వినిపిస్తోంది.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కేబినెట్ కూర్పుపై కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇప్పటివరకు కేబినెట్ విస్తరణపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.

మంత్రి పదవి విషయంలో సీనియారిటీ లేదంటే పొలిటికల్‌గా ఉన్న పరిచయాలను మాత్రమే కాకుండా.. ప్రాంతాల వారీగా ప్రాతినిధ్యం అలాగే సామాజిక సమీకరణాలు, పార్టీ కోసం చేసిన పని , రాజకీయంగా ఉన్న బలం వంటి అంశాలను కూడా హైకమాండ్ పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. అందుకే కేబినెట్ విస్తరణ జరిగితే ఎవరికి ఛాన్స్ వస్తుందన్నది కాంగ్రెస్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు కొండా సురేఖ వద్ద ఇప్పటి వరకూ ఉన్న దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖలను ఇప్పుడు ఎవరికి అప్పగిస్తారన్నదే మెయన్ ప్రశ్నగా ఉంది. కేబినెట్ విస్తరణ వెంటనే జరగకపోతే ఈ శాఖలను సీఎం కొంతకాలం తన వద్దే ఉంచుకుంటారా లేదంటే ఇప్పటికే మంత్రులుగా ఉన్న వారిలో ఎవరికైనా అదనపు బాధ్యతలను అప్పగిస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది.

ఇక్కడ మరో అంశం కూడా కీలకంగా మారుతోంది. శాఖలను తాత్కాలికంగా ఇతర మంత్రులకు అప్పగించినా.. దానిని పూర్తిస్థాయి మంత్రివర్గ విస్తరణకు సంకేతంగా భావించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ప్రభుత్వం తాత్కాలికంగా శాఖల బాధ్యతలను సర్దుబాటు చేయడం ఒక ప్రక్రియ కావొచ్చు. అసలు కొత్త మంత్రులను ఎప్పుడు తీసుకుంటారు? ఎవరికి అవకాశం ఇస్తారు? అన్నది మాత్రం హైకమాండ్, ముఖ్యమంత్రి మధ్య జరిగే చర్చలపైనే ఆధారపడి ఉంటుంది.

అయితే విస్తరణపై చర్చ పెరుగుతున్న కొద్దీ కాంగ్రెస్‌లో మంత్రి పదవుల ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతోంది. తమకు పార్టీ కోసం చేసిన సేవలు, నియోజకవర్గంలో ఉన్న బలం, ప్రాంతీయ ప్రాతినిధ్యం, సామాజిక వర్గ సమీకరణాలు కలిసొస్తాయని భావిస్తున్న నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ముఖ్యంగా మూడు బెర్తులు ఒకేసారి అందుబాటులోకి వస్తే.. కేబినెట్‌లో ప్రాంతాల మధ్య బ్యాలెన్స్ ఎలా పెడతారు? ఏ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తారు? ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న ప్రాంతాలకు మరో అవకాశం ఇస్తారా? లేక ఇప్పటివరకు ప్రాతినిధ్యం తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఛాన్స్ ఇస్తారా? అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.

Telangana Cabinet
Telangana Cabinet

ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్‌ను ముందుకు తీసుకెళ్లటానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో మంత్రి వర్గంలో ఖాళీలను భర్తీ చేయడం కూడా పాలనాపరంగా ప్రాధాన్యం ఉన్న అంశంగానే మారింది. ఖాళీగా ఉన్న బెర్తులు అలాగే కొనసాగిస్తారా? లేక ఒకేసారి కొత్త మంత్రులను తీసుకొచ్చి మంత్రి వర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తారా? అనేది కూడా ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

కొండా సురేఖకు సంబంధించిన శాఖలను ప్రస్తుత మంత్రుల్లో ఎవరికైనా తాత్కాలికంగా కేటాయిస్తారా? లేక సీఎం తన దగ్గరే ఉంచుకుంటారా? మూడు ఖాళీ బెర్తులను ఒకేసారి భర్తీ చేస్తారా? కొత్తగా వచ్చే మంత్రుల్లో ఎవరెవరు ఉంటారు? ప్రాంతీయ, సామాజిక సమీకరణాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు? అన్నదే ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్‌గా మారింది. ముఖ్యంగా మూడు బెర్తులు ఖాళీగా ఉండటంతో ఆశావహుల సంఖ్య పెరగడం మరింత ఉత్కంఠను పెంచుతోంది.

Konda Surekha : కూతురు చేసిన కామెంట్స్‌కి నన్ను బలి చేస్తారా? బర్తరఫ్‌పై కొండా సురేఖ ఆవేదన..

Related Articles

Back to top button