WhatsApp :వాట్సాప్ ఫీచర్స్‌లో కమ్యూనికేషన్‌ను ఈజీ చేసే ట్రెండీ ఆప్షన్స్
WhatsApp :ప్రస్తుత డిజిటల్ యుగంలో, వాట్సాప్( WhatsApp ) లేని స్మార్ట్‌ఫోన్‌ను ఊహించుకోవడం కష్టం. సాధారణ కమ్యూనికేషన్ నుంచి ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్స్, ఫైల్ షేరింగ్ వరకు, వాట్సాప్ అందరి జీవితంలో భాగంగా మారిపోయింది.

WhatsApp :ప్రస్తుత డిజిటల్ యుగంలో, వాట్సాప్( WhatsApp ) లేని స్మార్ట్‌ఫోన్‌ను ఊహించుకోవడం కష్టం. సాధారణ కమ్యూనికేషన్ నుంచి ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్స్, ఫైల్ షేరింగ్ వరకు, వాట్సాప్ అందరి జీవితంలో భాగంగా మారిపోయింది. అయితే, ఎంత టెక్నాలజీని అందిపుచ్చుకున్నా ఎప్పటి కప్పుడు అప్ డేట్స్ వస్తూనే ఉంటాయి. వాటిని కొంతమంది వాడతారు. మరి కొంతమందికి తెలియకపోవడంతో వాటిని వాడరు. వీటిలో కొన్ని ఫైల్స్‌ను ఇతరులు చూడకుండా సేఫ్టీగా ఉంచడం, లేదా ముఖ్యమైన డాక్యుమెంట్లను త్వరగా PDFగా మార్చడం వంటి ఫీచర్ల గురించి అందరూ తప్పకుండా తెలుసుకుంటేనే మంచిది.
మొబైల్‌తో డాక్యుమెంట్స్ స్కాన్ చేసి PDFగా మార్చడం..!
ఆఫీసు పనుల కోసం పేపర్ డాక్యుమెంట్లను PDFగా మార్చడం ఒక పెద్ద పనిగా అనిపిస్తుంది. సాధారణంగా, ఆ డాక్యుమెంట్స్‌ను స్కాన్ (document scanning) చేసి, కంప్యూటర్లోకి పంపి, ఆ తర్వాత PDF కన్వర్టర్ ఉపయోగించి మార్చాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పడుతుంది, అలాగే ప్రత్యేకంగా కంప్యూటర్ అవసరం. కానీ, ఇప్పుడు మీ మొబైల్లో వాట్సాప్ ఉంటే చాలు, ఈ పని క్షణాల్లో పూర్తవుతుంది.
ఎలా చేయాలి?
ముందుగా, మీరు డాక్యుమెంట్‌ను పంపాలనుకుంటున్న చాట్‌ను ఓపెన్ చేయాలి
చాట్ బాక్స్ పక్కన కనిపించే అటాచ్మెంట్ ఐకాన్ (పేపర్ క్లిప్ గుర్తు)పై నొక్కాలి
అందులో కనిపించే ఆప్షన్లలో డాక్యుమెంట్’ని ఎంచుకోండి.
ఇప్పుడు మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. ఆ కెమెరాతో మీరు స్కాన్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్లను ఫోటో తీయాలి
ఒకేసారి పది డాక్యుమెంట్ల వరకు స్కాన్ చేయవచ్చు.
స్కాన్ పూర్తయిన తర్వాత, వాట్సాప్ ఆటోమేటిక్‌గా వాటిని ఒకే PDF ఫైల్‌గా మారుస్తుంది.
ఈ PDF ఫైల్‌ను మీరు ఎవరికైనా పంపించవచ్చు, లేదా మీ ఫోన్లో సేవ్ చేసుకోవచ్చు.
వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్‌గా మార్చడం (వాయిస్ ట్రాన్స్క్రిప్షన్)..
కొన్నిసార్లు, వాట్సాప్‌లో పర్సనల్ ఆడియో మెసేజ్‌లు వస్తాయి. వాటిని పబ్లిక్‌లో వినడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో, ఆ ఆడియోలో ఏముందో త్వరగా తెలుసుకోవడానికి ఒక ట్రెండీ ఫీచర్ అందుబాటులో ఉంది.
ఎలా చేయాలి?
వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
అక్కడ ‘చాట్స్’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఇక్కడ ‘వాయిస్ ట్రాన్స్క్రిప్షన్’ లేదా ‘వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్'(voice message transcription) (ఈ ఫీచర్ థర్డ్-పార్టీ యాప్స్ ద్వారా అందుబాటులో ఉంది) అనే ఆప్షన్ కోసం చూడాలి. వాట్సాప్ ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా దశలో టెస్ట్ చేస్తోంది. కొన్ని అడ్వాన్స్డ్ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇన్‌బిల్ట్ ట్రాన్స్క్రిప్షన్ ఫీచర్ కూడా ఉంటుంది.
ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటే, మీరు దాన్ని ఎంచుకోవడం ద్వారా వచ్చే ఆడియో మెసేజ్‌లు టెక్స్ట్ రూపంలోకి మారతాయి.
దీంతో ఆడియో వినకుండానే, అందులో ఉన్న సమాచారాన్ని వెంటనే చదివి తెలుసుకోవచ్చు.
వ్యక్తిగత చాట్లను లాక్ చేయడం (చాట్ లాక్)!
కొందరు తమ పర్సనల్ చాట్లను ఇతరులు చూడకుండా గోప్యంగా ఉంచాలనుకుంటారు. మీ ఫోన్ ఎవరైనా తీసుకుని వాట్సాప్ చెక్ చేసినా, మీ వ్యక్తిగత సంభాషణలు సురక్షితంగా ఉండాలంటే చాట్ లాక్ ఫీచర్ ఉపయోగపడుతుంది.
మీరు లాక్ చేయాలనుకుంటున్న వ్యక్తిగత చాట్‌ను ఓపెన్ చేయాలి.
ఆ చాట్‌లోని కాంటాక్ట్ పేరుపై నొక్కండి (స్క్రీన్ పైభాగంలో).
క్రిందికి స్క్రోల్ చేస్తే ‘చాట్ లాక్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై నొక్కండి.
‘ఈ చాట్‌ను లాక్ చేయాలా?’ అని అడిగినప్పుడు ‘లాక్ దిస్ చాట్ విత్ ఫింగర్‌ప్రింట్’ లేదా ‘ఫేస్ అన్‌లాక్’ (మీ ఫోన్ సెట్టింగ్స్‌ను బట్టి) అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఇప్పుడు ఆ చాట్ మీ ప్రధాన చాట్ లిస్ట్ లో కనిపించదు, ‘లాక్డ్ చాట్స్’ అనే ఫోల్డర్లో కనిపిస్తుంది.
లాక్ చేసిన చాట్లను చూడాలంటే, మీ చాట్ లిస్ట్‌ను క్రిందికి స్వైప్ చేసి, ‘లాక్డ్ చాట్స్’ ఫోల్డర్‌పై నొక్కాలి.
ఇక్కడ మీరు మీ ఫింగర్‌ప్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్ ద్వారా దానిని తెరవవచ్చు.
వాట్సాప్ నిరంతరం కొత్త, ఉపయోగకరమైన ఫీచర్లను అందిస్తూనే ఉంది. అయితే, ఈ సౌకర్యాలను ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, తెలియని నంబర్ల నుండి వచ్చే అనుమానాస్పద బిజినెస్ ఆఫర్లు లేదా మనీ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన మెసేజ్‌లను వెంటనే వదిలేయడం మంచిది. ఎప్పుడు కూడా మీ డేటా సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే చాలు.